బిజీ బిజీగా బిత్తిరి సత్తి…

348
Bithiri Sathi Busy With Tollywood Movies.
- Advertisement -

తనదైన యాసతో, విభిన్న స్టైల్‌తో టివీ ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితమైన పర్సనాలిటీ బిత్తిరి సత్తి. తీన్మార్ ప్రోగ్రామ్ ద్వారా తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు బిత్తిరి సత్తి. సావిత్రితో కలిసి ఇతను పండించే వినోదం అంతా ఇంతా కాదు. బుల్లితెర ప్రేక్షకులకు ‘బిత్తిరి సత్తి’ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అంతగా ఆయన తనదైన మేనరిజంతో ఆకట్టుకున్నాడు. ‘బిత్తిరి సత్తి’ అసలు పేరు చేవెళ్ల రవి .. రంగారెడ్డి జిల్లాకి చెందినవాడు. ఒక టీవీ ఛానల్ లో ప్రసారమవుతోన్న ‘తీన్మార్’ కార్యక్రమం ద్వారా ఆయన బాగా పాప్యులర్ అయ్యాడు. సోషల్ మీడియాలోను ఆయనకి మంచి ఫాలోయింగ్ వుంది.

Bithiri Sathi Busy With Tollywood Movies

అలాంటి ‘బిత్తిరి సత్తి’ ఆ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేసి, సినిమాలు చేసుకోవాలనే ఆలోచనలో వున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆయనకి సినిమాలలో వరుస ఆఫర్లు వస్తున్నాయట. దాంతో ఈ కార్యక్రమానికి సమయాన్ని కేటాయించడం కష్టమవుతోందట. అందువలన ఆయన సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ ప్రచారంలో వాస్తవమెంతనే విషయంలో బిత్తిరి సత్తినే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

- Advertisement -