ఇలాంటి రోజును ఉహించలేదు..

209
Nayanthara and Vignesh pics viral
- Advertisement -

శింబు, ప్రభుదేవాతో లవ్ బ్రేకప్‌ తర్వాత దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడ్డ కోలీవుడ్ రాణి నయన్ మరోసారి వార్తల్లో నిలిచింది. విఘ్నేష్ బర్త్‌ డేను న్యూయార్క్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. ఈ ఫోటోలను అభిమానులతో పంచుకున్న విఘ్నేష్‌ ఆనందంతో ఉబ్బి తబ్బైపోతున్నాడట.

ఈ నేపథ్యంలో స్పందించిన విఘ్నేష్‌ నా జీవితంలో ఇలాంటి బర్త్‌డే ఉంటుందని కలలో కూడా ఊహించలేదని తెలిపాడు. ఈ జీవితాన్ని ఇంత అందంగా తయారు చేసిన దేవుడికి, నా ప్రియమైన సన్‌షైన్‌ నయనతారకి ముందుగా ధన్యవాదాలు అంటూ ట్విట్ చేశాడు విష్నేష్. పుట్టిన రోజున నయనతారతో గడపడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు.

విఘ్నేష్‌తో లవ్ విషయంలో ఎప్పుడూ ఏంతో సీక్రెట్ పాటించే నయనతార తొలిసారి విష్నేష్ తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం అంటే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లే అని అంటోంది సినీ ఇండస్ట్రీ. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా ఈ ప్రేమపావురాలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

- Advertisement -