అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలల్లో ప్రముఖ సెలెబ్రెటీలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. మోడీ మొదలుకొని సినీ స్టార్స్, సామాన్య ప్రజలు కూడా యోగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
అయితే ఇందులో భాగంగానే ఓ జంట యోగాసనాలతో మతిపోగొడుతోంది. వీరి యోగాసనాలు చూసిన వారంత షాక్ అవక తప్పదు మరి. ఇప్పటికే వారు వేసిన యోగాసనాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఇంతకీ ఆ జంట ఎవరు ? ఎలాంటి యోగాసనాలు వేశారు? అనేగా మీ డౌట్?
బాలీవుడ్ జంట బిపాసాబసు కరణ్ సింగ్ గ్రోవర్ ల యోగాభ్యాసనాలే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నిజానికి వీరికి ఫిట్నెస్ మీద ఫోకస్ ఎక్కువ. అంతేకాదు నిత్యంలో ప్రేమలో మునిగితేలుతుంటారు ఈ మొగుడు పెళ్లాలు.
ఎక్సర్ సైజులు, జిమ్ స్టెప్పుల ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హంగామా చేయడం వీరికి కొత్తేమీ కాదు. బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ జంట సరికొత్త ఆసనాలు వేస్తూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇప్పుడీ ఆ హాట్ హాట్ యోగాసనాలు కుర్రకారులో వేడి పుట్టిస్తున్నాయి. వివిధ భంగిమల్లో, ఒకరిపై ఒకరు ఉన్న పోజులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘యోగా జీవితంలాంటిది. ఇదో మ్యాజిక్’ అంటూ క్యాప్షన్ ఇచ్చి బిప్స్ తమ ఫొటోలను షేర్ చేసింది.
రెగ్యులర్ గా యోగా చేయాలని ఆమె సలహా కూడా ఇస్తోంది. ఇక ఈ ఇద్దరూ కలిసి చేసిన ఆసనాలు ఒకింత హాట్‌గా, కొంత విచిత్రంగా కూడా ఉన్నాయి. కావాలంటే మీరూ ఓ లుక్ వేయండి.
.