16వ బయో ఏషియా సదస్సు భాగ్యనగరం వేదికగా జరగనుంది. ఫిబ్రవరి 25 నుంచి 27(2019) వరకు మూడు రోజుల పాటు హెచ్ఐసీసీలో జరగనుంది. ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 55 దేశాల నుంచి వ్యాపారవేత్తలు,సైంటిస్టులు హాజరుకానున్నారు.
తెలంగాణ రాష్ట్ర లైఫ్ సైన్సెస్ సలహా కమిటీ సభ్యులు, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ చైర్మన్ సతీష్ రెడ్డి, ఎల్వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బాలసుబ్రమణ్యం, సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా, రిచ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజిత్ రంగ్నేకర్, తదితరులు బుధవారం మంత్రి కెటిఆర్‌ను కలిసి సదస్సు గురించి వివరించారు. ఈ సందర్భంగా సదస్సు లోగోను ఆవిష్కరించారు కేటీఆర్.
లైఫ్ సైన్సెస్ 4.0- C డిస్రప్ట్ ది డిస్రప్షన్ థీమ్ తో ఈ సదస్సును నిర్వహించనున్నారు. బయో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న ఆధునిక పరిశోధనల ఈ సమావేశంలో చర్చించనున్నారు.