బింబిసార…టీజర్ రిలీజ్

142
bimbisara
- Advertisement -

క‌ళ్యాణ్ రామ్ హీరోగా స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న చిత్రం ‘బింబిసార’. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌.. అన్నది ఉపశీర్షిక. వశిష్ట్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కేథరీన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలుగా న‌టిస్తుండగా కాసేపటి క్రితం టీజ‌ర్ విడుద‌ల చేశారు.

ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే, కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలైతే… ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యం మెలేసింది. అదే త్రిగర్దన సామ్రాజ్యపు నెత్తుటి సంతకం… బింబిసారుడి ఏకఛత్రాధిపత్యం… ” అనే పెద్ద డైలాగ్ టీజర్ లో ఆకట్టుకునే విధంగా ఉంది.

టీజర్ చివర్లో కళ్యాణ్ రామ్ ఆధునిక వస్త్రధారణలో ఉగ్రరూపంలో కన్పించడం ఆసక్తికరంగా మారింది. తెలుగుతో పాటు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -