రివ్యూ: బింబిసార

369
review
- Advertisement -

వశిష్ట దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బింబిసార. కల్యాణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ హిట్ కొట్టాడా లేదా చూద్దాం..

కథ:

బింబిసారుడు త్రిగర్తల రాజ్యానికి క్రూరమైన రాజు. అతని ఏకైక నినాదం ఎటువంటి దయ లేకుండా రాజ్యాలను జయించడమే. కానీ ఒక శాపం కారణంగా అతని జీవితం మారిపోతుంది…ఆ శాపం ఏమిటి? గతానికి, వర్తమానానికి సంబంధం ఏమిటి? ఇలాంటివన్ని తెలుసుకోవాలంటే తెరపై చూడాల్సిందే..

ప్లస్ పాయింట్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ, కళ్యాణ్ రామ్ నటన,కీరవాణి సంగీతం, సాంకేతిక విభాగం. తొలి సినిమానే అయినా దర్శకుడు వశిష్ట్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఫాంటసి సినిమాను మోడ్రన్ డే ఎమోషన్స్‌తో మిక్స్ చేసి అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక సినిమాకు బలం కళ్యాణ్ రామ్. తన కెరీర్‌లోనే బెస్ట్ నటన కనబర్చాడు. క్రూరమైన రాజుగా భయపెట్టాడు. యువరాణిగా కేథరిన్ ట్రెసా బాగుంది. హీరో, హీరోయిన్లు తమ క్యారెక్టర్స్‌లో ఒదిగిపోయారు. చాలా కాలం తర్వాత శ్రీనివాస్ రెడ్డికి మంచి పాత్ర లభించింది. మిగితానటీనటుల్లో వెన్నెల కిషోర్, ప్రకాశ్‌ రాజ్ మెప్పించారు.

మైనస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్‌ విలన్ బలహీనంగా ఉండటం, కథనంలో మరో హీరోయిన్‌ సంయుక్తా మీనన్ కేవలం ప్రేక్షకురాలు మాత్రమే. కీలక ట్విస్ట్‌లు రివీల్‌ కాగానే సెకండాఫ్ కాస్త స్లో అవుతుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్‌. MM కీరవాణి ఈ చిత్రానికి మరో బలం. అద్భుత సంగీతాన్ని అందించాడు. రిచ్ విజువల్స్ మరియు VFX అద్భుతంగా ఉంది. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది. సెకండాఫ్ చాలా సెన్సిబుల్ గా ముగిసి ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సూపర్బ్.

తీర్పు:

ఆరంగేట్ర సినిమాతోనే మెప్పించారు దర్శకుడు వశిష్ట్. స్క్రిప్ట్‌లో బలం, కళ్యాణ్ రామ్ నటన సినిమాను మరో స్ధాయికి తీసుకెళ్లింది. భావోద్వేగాలు, యాక్షన్, కామెడీ ,మంచి విజువల్స్‌ ప్రేక్షకులను అలరిస్తాయి. ఓవరాల్‌గా కళ్యాణ్ రామ్ కెరీర్‌లో ది బెస్ట్ మూవీ బింబిసార.

విడుదల తేదీ:05/08/2022
రేటింగ్:3/5
నటీనటులు: కళ్యాణ్ రామ్, కాథరిన్,సంయుక్త మీనన్‌
సంగీతం: కీరవాణి
నిర్మాత: హరికృష్ణ
దర్శఖత్వం: మల్లాది వశిష్ట్

- Advertisement -