ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా పాలకుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావుతో తలపడుతున్న కాంగ్రెస్ అభ్యర్థిపై విమర్శలు వెలువడుతున్నాయి. టీపీసీసీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి…జంగాపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
జంగా చరిత్ర మంచిది కాదని పాలకుర్తిలో రౌడీలకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే ఆయన కంటే ముందే తనపై రౌడీ షీట్ ఓపెన్ అయిందని..తనకే టికెట్ ఇవ్వాలని సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో స్థానికేతరులకు చోటు లేదని అన్నారు. నీతి, నిజాయితీ గల కాంగ్రెస్ పార్టీ నాయకులకే పార్టీ టికెట్ ఇవ్వాలని కోరారు.
నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు లేదా మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్లకు టికెట్ ఇవ్వాలని సూచించారు. క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులకు టికెట్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంజర్ రవినాయక్, పవన్, భిక్షపతి, మన్నన్, నర్సింహ, సుక్యా పాల్గొన్నారు.