వీఐ ఆనంద్ డైరెక్షన్‌లో రవితేజ సినిమా.. !

324
- Advertisement -

శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ “అమర్ అక్బర్ ఆంటోని” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మూడు విభిన్న పాత్రలతో ఈ సినిమాలో రవితేజ అలరించనున్నాడు.

ఈ క్రమంలో సినిమాపై అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇక త్వరలోనే సినిమాను అభిమానుల ముందుకు తీసుకురావాలని యూనిట్ భావిస్తోంది. అయితే.. శ్రీను వైట్లతో చేస్తున్న సినిమా పూర్తైన వెంటనే మరో సినిమా చేయాలని రవితేజ నిర్ణయించుకున్నాడు.

ఈ మేరకు మాస్ మహారాజతో సినిమా చేయడానికి దర్శకుడు వీఐ ఆనంద్ సన్నాహాలు మొదలుపెట్టారు. ఇక డిసెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. దీపావళి కానుకగా మూవీ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. రవితేజ ముగ్గురు భామలతో నటించనున్న ఈ సినిమా అభిమానులకు ఎంతవరకు చేరువవుతుందో చూడాలి మరి..

- Advertisement -