ఖాఖీ:ది బీహార్ చాప్టర్ హీరో సస్పెండ్‌..

187
- Advertisement -

బీహార్ ఐపీఎస్ ఆఫీసర్‌ అమిత్ లోధాను సస్పెండ్ చేశారు.  బీహార్ గబ్బర్ సింగ్ ఆఫ్ షేక్‌పురాగా పేరొందిన పింటు మహ్తో అశోక్ మహ్తోను ఎన్‌కౌంటర్‌ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. దీంతో దేశవ్యాప్తంగా అతన్ని పేరు మారుమోగింది.

ఈ ఎన్‌కౌంటర్ 2018లో బీహార్ డైరీస్‌ ద్వారా ఓ నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్ తీశారు. ఖాఖీ ది బీహార్ చాప్టర్‌ పేరు మీద నెట్‌ ఫ్లిక్స్‌ సిరీస్ చేశారు. అతను వెబ్ సిరీస్ కోసం ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని విజిలెన్స్ యూనిట్ తెలిపింది. డీల్ ద్వారా అమిత్ లోధా ₹ 12,372 అందుకున్నారని, అతని భార్య కౌమిడి ఖాతాలో ₹ 38.25 లక్షలు జమ చేశారని ఆరోపించారు. దీంతో అమిత్‌ను సస్పెండ్‌ చేసింది బీహార్ ప్రభుత్వం.

అమిత్‌ లోధా జైపూర్‌లో జన్మించారు. ఢిల్లీ ఐఐటీలో చదివారు. 1988లో ఐపీఎస్ అధికారిగా బీహార్‌ క్యాడర్‌కు ఎంపికయ్యారు. పింటు మహ్తో అశోక్‌మహ్తోను ఎన్‌కౌంటర్ చేసినందుకు ప్రెసిడెంట్స్‌ పోలీస్‌ మెడల్ ఫర్‌ మెరిటోరియస్ సర్వీస్ మరియు పోలీసు మెడల్ ఫర్ గ్యాలంటరీ మరియు ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్‌ని అందుకున్నారు. ప్రస్తుతం బీహార్ ఐజీపీగా సేవలందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ…

ఇక జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ బిజీబిజీ!

తెలంగాణ భవన్‌లో ప్రత్యేక పూజలు

- Advertisement -