Bihar:32 మందితో ‘సామ్రాట్’ కేబినెట్

6
- Advertisement -

బీహార్ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని కేబినెట్‌ను భారీగా విస్తరించారు. ఈ విస్తరణలో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధానాంశం మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిషాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రం మరియు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం.

బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో మొత్తం 32 మంది నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వంటి అగ్రనాయకులు హాజరయ్యారు.

Also Read:Modi:యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది

ఇంజనీరింగ్ పట్టభద్రుడైన నిషాంత్ కుమార్, తన తండ్రి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలుత పార్టీ కార్యకర్తగానే సేవ చేస్తానని చెప్పిన నిషాంత్, జేడీయూ (JDU) నేతలు మరియు కార్యకర్తల కోరిక మేరకు మంత్రి పదవిని చేపట్టారు.

పార్టీల వారీగా మంత్రుల సంఖ్య:

బీజేపీ (BJP): 15 మంది

జేడీయూ (JDU): 13 మంది

ఎల్జేపీ (రామ్ విలాస్): 2 మంది

హెచ్ఏఎం (HAM-S): ఒకరు

ఆర్ఎల్ఎం (RLM): ఒకరు

- Advertisement -