తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం దాని అనుబంద రంగాలలో సాదించిన పురోగతి, రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, పశుసంవర్థక శాఖ, చేపల పెంపకంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నాణ్యమైన విత్తనోత్పత్తికి తెలంగాణలో ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితులు, మఔలిక సదుపాయాల గురించి బీహార్ కృషి చేస్తుంది. దీనిలో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం అద్యయనం చేసి, రోడ్ మ్యాప్ తయారు చేయడానికి ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ బృందాన్ని తెలంగాణకు పంపడం జరిగింది.
ఇందులో భాగంగా బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి డా. ప్రేమ్ కుమార్, వ్యవసాయ అనుబంద శాఖల అదీకారులతో కలిసి హైదరబాద్ రావడం జరిగింది. మూడు రోజుల పాటు తెలంగాణాలో పర్యటించనున్న ఈ బృందం తెలంగాణ విత్తన పరిశ్రమలను, సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ లను, విత్తనోత్పత్తి క్షేత్రాలను, విత్తన పరీక్ష ల్యాబ్ లను కూడ సందర్శించనున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు, దేశంలో వ్యవసాయం దాని అనుబంధ రంగాల అభివృద్దికి ఏ రాష్ట్రం కూడా కేటాయించని బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం కేటాయించి వ్యవసాయ రంగంలో నూతన సంస్కరణలు తీసుకవచ్చి రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే ఎంతో పురోగతి సాధించి దేశం లోనే మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా చేశాడని, వ్యవసాయాన్ని లాభసాటి చేసి, అందరికీ అన్నం పెట్టె రైతన్నను ఆదుకోవడానికి, రైతు బంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత కరెంట్, ఋణ మాఫీ, త్వరిత గతిన నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం మొదలగు పథకాలు అందచేస్తున్నామని మంత్రి అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సీఎం ఆశయం ప్రకారం, దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వబోతున్నామని, అంతేకాకుండా నాణ్యమైన విత్తనాలను సకాలంలో రైతులకు అందచేస్తూ, మార్కెట్‌లో ఎలాంటి కల్తీ విత్తనాలా సరఫరా లేకుండా టాస్క్ ఫోర్స్ టీంలు, విజిలెన్స్ దాడులు, పిడి ఆక్ట్ లు ఉపయోగించి కటిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
అధెవిధంగా, దేశంలో పండ్లు, కూరగాయలు, చేపలు, మాంసం, విత్తనాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, దేశ ప్రధాని అనుకుంటున్నట్లుగా 2020 నాటికి రైతు ఆదాయం రెట్టింపు కావాలంటే, దేశ స్థాయిలో వ్యవసాయ రంగం ఒక పటిస్టమైన, సమగ్ర విశ్లేషణతో ఒక పాలసీ తీసుక రావాలని, అందుకు తెలంగాణ ప్రబుత్వం ముందుండి సహకరిస్తుందని ఈ సంధర్భంగా తెలిపారు.
అలాగే, వ్యవసాయ రంగ అభివృద్దికి చేపడుతున్న పథకాలు, చర్యలు, తెలంగాణ విత్తన రంగ అభివృద్దికి ఎంతగానో తోడ్పడుతున్నాయని, తద్వారా తెలంగాణలో నాణ్యమైన విత్తనోత్పత్తి చేపట్టి, దేశానికి కావలిసిన 60% విత్తనాలు తెలంగాణ నుంచి సరఫరా చేయడమే కాకుండా, దాదాపు 18 దేశాలకు విత్తనాలను ఎగుమతి చేస్తూ సీడ్ కాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నామని, భవిష్యత్తులో అంతర్జాతీయ విత్తన దృవీకరణ పద్దతి ద్వారా మరిన్ని దేశాలకు విత్తన ఎగుమతులు చేపడతామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం విత్తన రంగాన్ని మరింత అభివృద్ది చేయాలనే ఉద్యేశంతో, హైదరబాద్‌కు 30 కిలోమీటర్ల దూరంలో, బండమైలారం గ్రామంలో 150 ఎకరాలలో విత్తన పరిశోదన సంస్థలు, విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్లు, అధునాతన విత్తన పరీక్ష ల్యాబ్‌లు, శీతల గిడ్డంగులు, గోదాములు, ట్రైనింగ్ సెంటర్లు, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి విత్తన కంపెనీలు ఒకే ప్రదేశంలో ఉండే విధంగా సీడ్ పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని, ఇప్పటికే దానికి సంబంధించిన భూ కేటాయింపులు కూడా పూర్తవుతునాయని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ సమావేశంలో బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి డా. ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. క్రొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం రైతు సంక్షేమానికి, వ్యవసాయ రంగా అభివృద్దికి తీసుకుంటున్న చర్యలను, పథకాలను అద్యయనం చేసి, “బీహార్ కృషి రోడ్ మ్యాప్” తయారు చేయడానికి తెలంగాణకు రావడం జరిగిందని, అదేవిధంగా బీహార్ విత్తన పరిశ్రమ అభివృద్దికి కొత్త విత్తన పాలసీని తీసుకొస్తున్నామని, సూక్ష్మ నీటి పారుదల రంగం, విద్యుత్ రంగంలో కొత్త సంస్కరణలు తెస్తున్నామని, దీనికి తెలంగాణ ప్రభుత్వ సహకారం ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని కోరారు.
తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ద్వారా వరి, మొక్కజొన్న విత్తనాలు దిగుమతి చేసుకుంటామని, దేశంలో ఈ రాష్ట్రానికి వెళ్ళిన తెలంగాణ విత్తనాలకు మంచి పేరు ఉందని, ఈ పర్యటనలో హైదరబాద్ చుట్టూ పక్కల ఉండే విత్తన కంపెనీలు, ప్రసాసింగ్ ప్లాంట్, కోల్డ్ స్టోరేజ్ యూనిట్ లు, విత్తన పరీక్ష ల్యాబ్ లను సందర్చించి అద్యయనం చేస్తామని, రాబోయే రోజులలో బీహార్ రాస్త్రాన్ని సందర్చించ వలసిందిగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రిని ఈ సందర్భంగా కోరారు.