శివజ్యోతికి షాక్.. టాప్ 5లోకి బాబా భాస్కర్

376
Baba Bhaskar
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 3 చివరి ఘట్టానికి చేరుకుంది. ప్రస్తుతం హౌజ్ లో ఆరుగులు సభ్యులు ఉండగా అందులో నుంచి ఒకరిని ఈ వారం ఇంటికి పంపించనున్నారు. వీరిలో ఐదురుగురు ఫైనల్ కు చేరుకుంటారు. ఇప్పటికే రాహుల్ టాప్ 5కి చేరుకోగా, తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో బాబా భాస్కర్ కూడా టాప్ 5లో ఉన్నట్లు ప్రకటించారు బిగ్ బాస్. ఈవారం నామినేషన్స్‌లో ఉన్న బాబా భాస్కర్‌ని ప్రేక్షకులు తమ ఓట్లు ద్వారా రక్షించారని అతన్ని సేవ్ చేస్తూ టాప్ 5 ఫైనల్ కంటెస్టెంట్‌గా ప్రకటించారు. అనంతరం కన్ఫెషన్ రూంకి పిలిచి బాబాకి టికెట్‌ టు ఫినాలేను అందించారు బిగ్ బాస్.

దీంతో ఈ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ తనను గెలిపించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ టికెట్ టు ఫినాలేను ఆడియన్స్‌నికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు బాబా భాస్కర్. ఇక మిగతా నలుగురు శ్రీముఖి, వరుణ్ సందేశ్, అలీరెజా, శివజ్యోతి వీరిలో ఎవరో ఒకరు రేపు హౌస్ నుంచి వెళ్లిపోనున్నారు. ఇక నిన్నటి టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్‌కి KLM ఫ్యాషన్స్ వాళ్లు ఫ్యాషన్ షో నిర్వహించారు.

ఇందులో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చి మిస్టర్ అండ్ మిస్ బిగ్ బాస్ హౌస్‌‌గా నిలిచిన వాళ్లకు KLM ఫ్యాషన్స్ తరుపున పదివేల గిఫ్ట్ ఓచర్ ప్రకటించారు బిగ్ బాస్.అయితే ఈ ఫ్యాషన్ షోలో పెర్ఫామెన్స్ పక్కన పెట్టేసి తమకు ఇష్టమైన కంటెస్టెంట్స్‌ను విజేతలుగా ప్రకటించుకున్నారు. పురుషుల్లో అలీ, వరుణ్, బాబా, రాహుల్‌లు పెర్ఫామ్ చేయగా.. వీళ్లలో అలీ, వరుణ్‌లు స్టైలిష్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. అయితే వీళ్లలో విజేతను ప్రకటించేది మహిళను కాబట్టి ఈ ఇద్దర్నీ కాకుండా తమకు ఇష్టమైన బాబా భాస్కర్‌ని మిస్టర్ కేఎల్ఎమ్ ఫ్యాషన్‌గా ఎంపిక చేశారు. ఇక మహిళల్లో శ్రీముఖి మంచి పెర్ఫామెన్స్ ఇవ్వగా.. శివజ్యోతిని విన్నర్‌గా ప్రకటించి ఆమెను మిస్ కేఎల్ఎమ్ ఫ్యాషన్‌‌గా ఎంపిక చేశారు బాబా, అలీ, రాహుల్, వరుణ్‌లు.

- Advertisement -