గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన రాహుల్ సిప్లిగంజ్

257
Rahul

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు విశేషమైన స్పందన వస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గోంటున్నారు. తాజాగా యాంకర్ సుమ విసిరిసన గ్రీన్ ఛాలెంజ్ సవాన్ ను స్వీకరించారు బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సింప్లింగజ్ .

తన ఇంటి ఆవరణలో మూడు మొక్కలు నాటారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రాహుల్ మరో ముగ్గురికి సవాల్ విసిరారు. ఫలక్ నుమా దాస్ హీరో విశ్వక్ సేన్, పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్‌ భాస్కర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ లకు సవాల్ విసిరారు.

మరోవైపు గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా లాంకో హిల్స్ లేక్ సమీపానగల ghmc పార్క్ నందు ప్రముఖ సినీ నటీమణులు రజిత, రాగిణి ,తదితరుల మొక్కలు నాటారు . ప్రకృతి ని కాపాడుకుని మానవ జాతి మనుగడకు మనవంతు సాయం చేసే అవకాశం ఇచ్చిన జోగినపల్లి సంతోష్ , ప్రత్యేక అభినందనలను తెలియచేసారు.

Rahul Sipli

film