ఇక పటాస్ షో చేయనుః శ్రీముఖి

258
Anchor Srimukhi Over Action in Patas Show

బుల్లితెర యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. యాంకర్ గా చేస్తూ అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తుంది. అయితే శ్రీముఖి ఫేమస్ అయింది మాత్రం పటాస్ షో ద్వారానే అని చెప్పుకోవాలి. యాంకర్ రవి శ్రీముఖి జోడి వల్లే పటాస్ అంత హిట్ అయిందని చెప్పుకోవాలి. అయితే శ్రీముఖి బిగ్ బాస్ షో కు వెళ్లిన తర్వాత పటాస్ లోకి రవి పక్కన వర్షిణి యాంకర్ గా చేస్తుంది.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో పూర్తి అయ్యాక తాజాగా శ్రీముఖి మాల్దీవ్స్ నుంచి పెట్టిన వీడియో లైవ్ లో తానిక పటాస్ షో చేస్తానో లేదో అంటూ క్లారిటీ లేకుండా మాట్లాడింది. దీంతో ఇక శ్రీముఖి పటాస్ లో కనపడే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని శ్రీముఖి పరోక్షంగా చెప్పేసింది. అయితే బిగ్ బాస్ లోకి వెళ్లెకంటే ముందు రవితో శ్రీముఖికి గొడవ అయిందని తెలుస్తుంది.

అయితే బిగ్ బాస్ లో యాంకర్ రవి స్పెషల్ గెస్ట్ గా వచ్చి అలీరెజాను కలిశాడు. ఆ సమయంలో శ్రీముఖి ఉన్నప్పటికీ తనతో పాటు పటాస్‌లో చాలా ఏళ్లు కలిసి చేసిన రవిని కనీసం పలకరించలేదు. రవియే కల్పించుకొని శ్రీముఖికి హాయ్ చెప్పాడు. దీంతో వీరిద్దరి మధ్య తప్పకుండా గొడవ జరిగిందని వార్తలు వస్తున్నాయి. కాగా తన ఫ్యూచర్ ప్లాన్స్ ను త్వరలోనే ప్రకటించనుంది శ్రీముఖి.