70రోజులు.. 60 కెమెరాల మధ్య.. 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన బిగ్ బాస్ షో చివరి అంకానికి చేరుకుంది. ఈ షోకు స్టార్ హీరో తారక్ హోస్టింగ్ చేయనుండడం.. తెలుగులో ఈ తరహా షో రావడం ఇదే తొలిసారి కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు.. మరెన్నో అనుమానాలు.. ఏదైతేనేం అంచనాలను అందకుంటూ.. అనుమానాలను పటాపంచలు చేస్తూ విజయం సాధించింది తెలుగు ‘బిగ్ బాస్’. చూస్తుండగానే షో ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. ఇప్పుడు మిగిలింది ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే.
బిగ్ బాస్ సీజన్ 1లో విజేతలేవరోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. నెగటివ్ టాక్‌తో ప్రారంభమైన బిగ్ బాస్ తర్వాత మంచి టీఆర్‌పీ రేటింగ్స్‌తో దూసుకుపోయింది. ప్రేక్షకుల ఆదరణతో 69వ ఎపిసోడ్ సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ఈ షో విజేఏత ఎవరో తెలేందుకు మరో 24 గంటలు మాత్రమే మిగిలిఉంది.
ఆదివారం రోజు బిగ్ బాస్ ఫైనల్‌ను గ్రాండ్‌గా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు వేడుక ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేగాదు ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా ప్రముఖ హీరో రానున్నాడట.
ఇక బిగ్ బాస్ సీజన్ వన్‌లో విజేతగా ఎవరుగెలుస్తారోనన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం శివ బాలాజీ, ఆదర్శ్ మధ్య నెక్ లు నెక్ పోరు కొనసాగుతున్నది.. ఇక మూడో స్థానంలో రవితేజ కొనసాగుతున్నది.. ఇంకా ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేందుకు శనివారం రాత్రి వరకూ గడువు ఉంది.. కాగా ఈ ఆదివారం ప్రసారమయ్యే చివరి ఎపిసోడ్ ను మరింత ఆసక్తికరంగా ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్టు సమాచారం.
ఇప్పటికే బిగ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారందరు మళ్లీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. వీరందరి సమక్షంలో ఫైనల్ కార్యక్రమం ఉత్కంఠ భరతంగా సాగనుంది. ఈ ఎపిసోడ్ లోనే బిగ్ బాస్ విజేతకు రూ 50 లక్షల నగదును బహుమతిగా ఇవ్వనున్నారు..
ఓ వైపు బిగ్ బాస్ సీజన్ వన్ సక్సెస్ కావడంతో పాటు మరోవైపు ఎన్టీఆర్ నటించిన జై లవకుశ హిట్ టాక్‌తో కలెక్షన్ల రాబడుతుండటంతో ఆయన ఫుల్ జోష్ మీదున్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 2కి కూడా హోస్ట్‌గా ఎన్టీఆర్‌నే సంప్రదించారనే వార్తలు రావడంతో ఈ షోపై మరింత ఆసక్తిపెరిగింది.