బిగ్ బాస్ షో మొదలైనప్పటి నుండి కంటెస్టెంట్స్ హౌజ్‌లో వారి టాలెంట్ చూపిస్తుంటారు.. గొడవలు.. ఏడుపులు.. అబద్దాలు.. యాక్టింగ్‌లు బయటపెడుతుంటారు. ఇక ఈ సీజన్‌కి వచ్చిన కంటెస్టెంట్స్ అయితే మహా ముదుర్లు.. ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారు. అన్ని సీజన్స్‌ను చూసి బాగా అవపోసన పట్టేసి.. ఇక్కడ ఎలా ఉంటే హైలైట్ అవుతాం అనే లెక్కలు కూడా వేసుకుని మరీ వచ్చారు. అయితే వీరి సంబంధించిన చర్చలు సోషల్ మీడియాలో ఎలా జరుగుతాయో అందరికీ తెలిసిందే. ఏ ఒక్క కంటెస్టెంట్ అబద్దం చెప్పినా మిగతా కంటెస్టెంట్ల అభిమానులు వారిని పట్టించేందుకు రెడీగా ఉంటారు. అందుకే బిగ్ బాస్ ఇంట్లో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. అబద్దాలు చెప్పి తప్పించుకుంటామంటే కుదరదు. ఆర్జే కాజల్ విషయంలోనూ అదే జరిగింది. ఇంట్లో వంట పని చేయను, వంటచేయడం రాదంటూ బుకాయించింది. అడ్డంగా బుక్కైంది. అయితే ఈ విషయాన్ని బిగ్ బాస్ టీం కూడా పసిగట్టింది.
సోషల్ మీడియాను ఈ సారి బిగ్ బాస్ టీం ఎక్కువగానే ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. బిగ్ బాస్ ఇళ్లు, అందులోని కంటెస్టెంట్ల గురించి సోషల్ మీడియాలో ఎలాంటి చర్చలు నడుస్తున్నాయి.. వారు దేనిపై అసంతృప్తిగా ఉన్నారు.. దేన్ని కోరుకుంటున్నారు? అనే విషయాలను బిగ్ బాస్ టీం బాగానే అనాలిసిస్ చేసినట్టుంది. ఈ క్రమంలో షణ్ముఖ్ గురించి నాగార్జున పరోక్షంగా హెచ్చరించారు. కొంచెం మాట్లాడరా.. కనిపించరా.. ఆడురా.. ఏంట్రా ఇది అంటూ షణ్ముఖ్‌ను తన స్టైల్లోనే ఆడుకున్నాడు నాగార్జున. ఇక ఆర్జే కాజల్ విషయానికి వచ్చేసరికి అడ్డంగా బుక్ చేసేశాడు. నీకు వంటలు రావా? అని నాగార్జున నేరుగా కాజల్‌ను అడిగేశాడు. ఏం సమాధానాలు చెప్పాలో తెలియక నీళ్లు నములుతున్న సమయంలోనే బాంబ్ పేల్చాడు నాగార్జున. మా వాళ్లు నీ ఇన్ స్టాగ్రాంను చెక్ చేశారు. అందులో వంటల వీడియోలున్నాయని గుట్టు విప్పేశాడు నాగ్. ఇక ఆ మాట అనడంతోనే కాజల్ తెల్లబోయింది. అదే సమయంలో శ్రీరామచంద్ర ఇచ్చిన రియాక్షన్ అదిరిపోయింది. మహానటివి కదా? అమ్మ అనే రేంజ్‌లో శ్రీరామచంద్ర చేతులు పైకి ఎత్తేశాడు. అలా కాజల్‌ను బిగ్ బాస్ టీం బాగానే పట్టించేసింది. నాగార్జున కూడా నవ్వుతూనే కాజల్‌కు మంటపెట్టేశాడు.
ఇక ఈ సీజన్‌లో మొదటి ఎలిమినేషన్‌ను ఈరోజు ఎపిసోడ్‌లో జరుగబోతుంది. ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన యాంకర్ రవి.. సరయు.. హమీద.. జెస్సీ.. మానస్ మరియు కాజల్ లలో రవి మరియు హమీదాలు సేఫ్ అయ్యారు. ఇంకా నలుగురు అన్ సేఫ్ లోనే ఉన్నారు. నలుగురిలో ఒక్కరు మాత్రం ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఆ ఒక్కరు ఎవరు అనేది ఇప్పటికే తేలిపోయింది. షూటింగ్ శనివారం సాయంత్రం వరకు ముగిసింది కనుక గతంలో మాదిరిగా మళ్లీ లీక్ అయ్యింది. సరయు ఈ సీజన్ ఫస్ట్ ఎలిమినేషన్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజమో ఈరోజు ఎపిసోడ్ చూస్తే తెలిసిపోతుంది.