సరయు ఎలిమినేట్…షాక్‌లో విశ్వ

22
sarau

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 తొలి ఎలిమినేషన్ ఘట్టం ముగిసింది. అంతా ఉహించినట్టుగానే ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్న సరయు తొలివారం ఇంటి నుండి బయటకు వచ్చేసింది. చివరగా జెస్సీ,సరయు మిగలగా ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకునేందుకు కాస్త టెన్షన్ పెట్టిన నాగ్‌ ఇందు కోసం సైకిళ్లను సెటప్ చేసేశాడు. జెస్సీ సైకిల్ లైట్ వెలగడంతో అతను సేఫ్ అయినట్టు ప్రకటించాడు. సరయు ఎలిమినేట్ అయిందని తెలియడంతో అందరూషాక్ అయ్యారు. ఇక విశ్వ చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేశాడు.

తర్వాత ఇంటి నుండి బయటకు వచ్చిన సరయు ఒక్కొక్కరిని ఆడుకుంది. నాగ్ ఇచ్చిన టాస్క్‌లో బాగంగా బెస్ట్ కంటెస్టెంట్ల గురించి చెబుతూ ఎమోషనల్ అయింది.శ్వేత,మానస్,ప్రియాంక,విశ్వ ,హమీద బెస్ట్ కంటెస్టెంట్స్ అని చెబుతూ వారిని చాలా మిస్సవుతున్నానని తెలిపింది.

ఇక వరెస్ట్ కంటెస్టెంట్లుగా సిరి, సన్నీ, లహరి, షన్ను, కాజల్‌లను ఎంచుకుంది. సిరి గురించి చెబుతూ ఆమెను ఆటాడుకుంది. అందరూ తన వద్దే ఉండాలని కోరుకుంటుంది.. షన్ను, సిరి కలిసి ఆడుతున్నారు. లహరి గురించి చెబుతూ.. నిన్ను నువ్వు ఫ్రూవ్ చేసుకోవడానికి ఎదుటి వాళ్లను తక్కువ చేయాల్సిన పని లేదని…. షన్ను గురించి మాట్లాడతూ.. అరేయ్ ఏంట్రా ఇది.. బయటే అనుకుని ఇలా రావొద్దురా అని పంచ్‌ ఇచ్చింది.