బిగ్ బాస్ 5: ప్రియకు లహరి హగ్.. ర‌వి మైండ్ బ్లాక్..

109
- Advertisement -

బిగ్ బాస్ 5 సీజన్‌ విజయవంతంగా 21 ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకుంది. హౌజ్‌లో ఇంటి సభ్యుల మధ్య రచ్చ రచ్చ జరుగుతుంది. అయితే శనివారం నాటి ఎపిసోడ్‌లో హోస్ట్‌ నాగార్జున వారిని కంట్రోల్‌లో పెట్టే దిశ‌గా ముందుకు అడుగులు వేశారు. ఈ నేపథ్యంలో ముందుగా ఇంటి స‌భ్యుల‌ని సీరియ‌స్‌గా ప‌ల‌క‌రించిన నాగ్‌.. రవి, ప్రియ పేర్లు రాసి ఉన్న టైల్స్‌ను సుత్తెతో పగలగొట్టాడు. ముందుగా ర‌విని ఏమైంది రవి అని అడగ్గా.. నామినేషన్స్‌లో లహరిని నామినేట్ చేస్తూ మధ్యలోకి నన్ను లాగింది. లహరి నేను హగ్ చేసుకున్న దాన్ని బాత్ రూం.. మిడ్ నైట్ అని మసాలా కలిపి సీన్ చేసింది.. కానీ అక్కడ అంత సీన్ జరగలేదు.

హాల్‌లో బెడ్ రూంలో ఎలాగైతే నార్మల్ హగ్ చేసుకున్నామో అక్కడ కూడా అలాగే చేసుకున్నాం అని చెప్పాడు రవి.అయితే ఇందులో తప్పు ఎవరిది అని అంటావ్ అని నాగార్జున కౌంటర్ క్వచ్ఛన్ వేశారు. ఖచ్చితంగా ప్రియ గారిదే అని అన్నాడు రవి. దీనికి ప్రియ‌ని ప్ర‌శ్నించ‌గా, అందుకు ఆమె నేను వాళ్లని తప్పుగా అర్థం చేసుకోలేదు.. లహరి అడిగినందుకే నేను విషయం చెప్పాను. ఆ సందర్భంలో నేను మెన్ అనే విషయాన్ని మెన్షన్ చేశాను.. అని చెప్పింది ప్రియ.

దీంతో నాగార్జున.. బిగ్ బాస్ హౌస్‌లో జెండర్ డిఫరెన్స్ లేదు.. హగ్ ఇవ్వడం బిజీగా ఉండటమా? మీరు చెప్పిన విధానం కరెక్ట్ కాదు. అని అన్నారు నాగార్జున. అయితే ఈ ఇష్యూలో ర‌వి తొండి ఆటని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు ల‌హ‌రికి చూపించాడు నాగార్జున‌. ప‌వ‌రూంలోకి పిలిచి ల‌హ‌రికి ఓ వీడియో చూపించారు నాగార్జున‌. అందులో ర‌వి.. ప్రియ‌తో మాట్లాడుతూ పెళ్లైన వాళ్లు చాలామంది ఉన్నప్పటికీ ఆమె తన వెంటే పడుతుందని, యాంక‌రింగ్ కోసం బాగా ట్రై చేస్తుంద‌ని కొంచెం బ్యాడ్ గా మాట్లాడాడు.

ఇక బయటకు వచ్చిన తరువాత.. రవిని చూస్తూ నువ్ నాతో ఏం చెప్పావ్.. ప్రియతో ఏం చెప్పావో వీడియో చూపించారు.. నేను యాంకర్ కావడానికి నీ సపోర్ట్ కావాలా? నీ వెనుకపడ్డానా? అని నిలదీసింది లహరి. అప్పుడు కూడా రవి.. అమాయకంగా మొహం పెట్టి కవర్ చేయడానికి ప్రయత్నించాడు. సర్లే మొత్తానికి నా కళ్లు తెరిపించావ్ అని లహరి.. వెళ్లి ప్రియని హగ్ చేసుకుంది. రవికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

అయితే చివర్లో ఇష్యూ క్లియర్ అయ్యిందా? రవి అని నాగార్జున అడగ్గా.. ఏదో చెప్పబోయి మళ్లీ అడ్డంగా బుక్ అయ్యాడు. అసలు నువ్ చెప్పాలని అనుకుంటున్నావ్ అని నాగార్జున అడగ్గా.. ‘అలా కాదు.. ట్రాన్స్‌లో ఉన్నారు.. అదీ ఇదీ అంటూ సోది చెప్తుండటంతో.. ‘ఇదంతా కాదు నేను సింగిల్ మెన్ అని ఉపయోగించలేదు.. అమ్మ మీద ఒట్టు అక్కా.. నేను ఆ మాట అనలేదక్కా అని అన్నావ్ కదా.. ఆ మాట అన్నావా? లేదా? అని నాగార్జున గట్టిగా అడగ్గా.. అన్నాను సార్.. ఒప్పుకుంటున్నా అని చెప్పాడు రవి.

ఏం ప్రియా.. రవి ఒప్పుకున్నాడా? అంటే.. లేదు సార్ ఒప్పుకోలేదు అని చెప్పింది ప్రియ. దీంతో నాగార్జున కోపం రెట్టింపు అయ్యింది.. నువ్ ఏం మాట్లాడావో అన్ని వీడియోలు ఉన్నాయి ప్లే చేయించమంటే చేయిస్తా అని అంటూ.. నీకు ఏం చెప్పాడు లహరి అని ఆమెను అడిగాడు. ఆ మాట అనలేదని చెప్పాడంటూ లహరి అనడంతో.. ఇప్పుడైనా తెలిసిందా? తప్పు ఎవరిదో అని అడిగి రవి ఇజ్జత్ మొత్తం తీసిపారేశాడు నాగార్జున.

- Advertisement -