బిగ్ బాస్‌ 4 తెలుగు…ముహుర్తం ఫిక్స్‌!

260
big boss 4
- Advertisement -

తెలుగులో సక్సెస్స్‌ ఫుల్‌గా 3 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్‌ సీజన్‌ 4కి ముహర్తం ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని స్టార్ మా అఫిషియల్‌గా ప్రకటించింది. సెప్టెంబర్ 6వ తేది సాయంత్రం 6 గంటల నుండి బిగ్ బాస్ 4 ప్రసారం కానుందని తెలిపింది.

కరోనా నేపథ్యంలో 10 వారాలు మాత్రమే షో కొనసాగనుండగా హోస్ట్‌గా నాగార్జన వ్యవహరించనున్నారు. ఈ సీజన్‌లో పాల్గొనబోతున్నవారికి ముందుగానే కోవిడ్-19 పరీక్షలు చేసి వారందర్ని క్వారంటైన్‌కు తరలించారు.

ఇక ఈ సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరన్నదానికి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత కొంత కాలంగా నోయల్, టీవీ 9 దేవి నాగవల్లి, రఘు మాస్టర్, దేత్తడి హారిక తదితరులు పేర్లు గట్టిగా వినిస్తుండగా వారు ఎవరు అన్నది తెలియాలంటే సెప్టెంబర్ 6 వరకూ ఆగాల్సిందే.

- Advertisement -