గత ఏడాది తెలుగులోకి అరంగేట్రం చేసిన ‘బిగ్ బాస్’ షో అంచనాల్ని మించి విజయం సాధించింది. ఇటు జూనియర్ ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్.. అతడి వాక్చాతుర్యం.. మరోవైపు పార్టిసిపెంట్ల ఆకర్షణ కూడా తోడై షో బాగానే విజయవంతమైంది. మరి ఈసారి ‘బిగ్ బాస్’ సీజన్ 2 ఎలా నడుస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 2 కార్యక్రమానికి నాని వ్యాఖ్వాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
నేటి నుంచి ‘బిగ్ బాస్’ సీజన్ 2 ప్రారంభం కాబోతోంది. ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్-1 భారీ విజయం అందుకోవడంతో రెండవ సీజన్‌పై నిర్వాహకులు భారీ మొత్తంలో ఖర్చుచేస్తున్నారు. ఇందులో 16 మంది సెలబ్రిటీలు, 100 రోజులు ఈ సీజన్ హంగామా కొనసాతుంది. ఈ కార్యక్రమం ప్రతి శని, ఆదివారాలో రాత్రి 9 గంటలకు, ప్రతి సోమ, శుక్ర వారాల్లో 9.30 గంటలకు బిగ్ బాస్ ప్రసారం కానుంది.
మరికొన్ని గంటల్లో షో ప్రారంభం కాబోతున్నప్పటికీ అందులో పాల్గొనే సెలబ్రిటీలు ఎవరన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది. ఈ క్రమంలో బిగ్ బాస్‌లో పాల్గొనబోతున్నది వీరేనంటూ ఓ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. నటి రాశి, సింగర్ గీతా మాధురి, దీప్తి సునయన, యాంకర్ శ్యామల, టీవీ9 యాంకర్ దీప్తి, ధన్య బాలకృష్ణ, నటి గజాలా, నటి శ్రీదేవి, నటి/యాంకర్ వర్షిణి సౌందేరాజన్, నటులు రాజ్ తరుణ్, వరుణ్ సందేశ్, తనీష్, ఆర్యన్ రాజేశ్, యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ కాకుమాను, జూనియర్ ఆర్టిస్ట్/కమెడియన్ వేణు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు. వీళ్లతో నాని ఎలా చేస్తాడో.. చూడాలి మరి.