ఆర్ఆర్ఆర్‌ లుక్‌లో రేవంత్‌ అదుర్స్!

207
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా సాగుతోంది. మరి కొద్దిరోజులే బిగ్ బాస్ 6వ సీజన్‌ మిగిలిఉండగా కుటుంబ సభ్యులని ఇంట్లోకి ప్రవేశ పెట్టి షో రేటింగ్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ వారం ప్రస్తుతం ఇంట్లో ఉన్న సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్‌ని ప్రవేశ పెట్టి సర్‌ప్రైజ్ ఇస్తున్న బిగ్ బాస్‌ రేవంత్‌కు అలాంటి అదిరే గిఫ్ట్ ఇచ్చారు.

తొలుత వీడియో కాల్‌లో రేవంత్ భార్యతో మాట్లాడించారు. అయితే ఆమె మాట్లాడుతుండగానే కాల్ కట్ కావడంతో రేవంత్ ఎమోషన్ అయ్యారు. దీంతో రేవంత్ కంటతడి పెట్టుకోగా కాసేపటికి రేవంత్ అమ్మ ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తర్వాత ఆమె కంటెస్టెంట్స్ అందరినీ చాలా బాగా పలకరించారు.

శ్రీహాన్, కీర్తిలను ప్రత్యేకంగా పలకరించారు. కీర్తిని కూతురుతో సమానంగా. ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చని చెప్పింది. ఇక కొడుకు రేవంత్ తో ఆప్యాయంగా మాట్లాడారు. కోపం తగ్గించుకో అని సలహా ఇచ్చారు. రేవంత్ భార్య గర్భవతిగా ఉన్న క్రమంలో అతడు గడ్డం పెంచుతుండగా కొంచెం గడ్డం కట్ చేసుకోమని చెప్పింది. దాంతో రేవంత్ నీట్ షేవ్ చేసుకొని మీసం మాత్రం ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్ మాదిరి తిప్పాడు. అచ్చం ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్‌ లాగే కనిపించగా రేవంత్ లుక్‌ చూసి ఇంటి సభ్యులు సైతం షాక్‌ అయ్యారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -