పసుపుతో ఆరోగ్యం……

171
turmeric

మన ఇంట్లో ఉండే పసుపులో ఎన్నో ఔషధగుణాలున్నాయి. పసుపుతో మనషి ఆరోగ్యానికి సంబంధించిన పలు వ్యాధులను, చర్మసమస్యలను దూరంచేసుకొవచ్చు.

ఒక స్పూను పసుపు, రెండు స్పూన్ల గంధం పొడికి తగినన్ని పాలను చేర్చి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకొని పదినిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా నెలరోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే మొటిమలు, వాటివల్ల పడ్డ మచ్చలు దూరమవుతాయి.

కొంతమందికి ముఖం జిడ్డుగా మారిపోతుంటుంది. దీనికి చక్కని పరిష్కారం.. రెండు స్పూన్ల గంధం పొడి, చిటికెడు పసుపుకి రెండు టేబుల్‌ స్పూన్ల నారింజ రసం కలిపి ముద్దలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకొని.. ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే జడ్డు సమస్య దూరమవుతుంది.

వయసు పెరుగుతున్న కొద్ది ముఖంపై సన్నటి గీతలు కనిపిస్తుంటాయి. దీనికి.. ఒక కప్పు బియ్యప్పిండిలో చిటికెడు పసుపు, కాసిని పచ్చిపాలు, రెండు టేబుల్‌ స్పూన్ల టమాటా రసం కలిపి మరీ గట్టిగా కాకుండా పేస్ట్‌ చేసుకోవాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు నలుగులా పెట్టుకోవాలి. పది నిమిషాలు అలానే ఆరనిచ్చి ముఖం కడిగేసుకుంటే సరి. ముడతలు, మృతకణాల వంటివి పోయి చర్మం నునుపుగా, కాంతివంతంగా తయారవుతుంది.

వేడిపాలలో కొద్దిగా పసుపు కలిపి తాగడం చేత కఫము తగ్గుతుంది. అదేవిధంగా ఆహార పదార్ధాలలో పసుపు కొద్దిగా వాడటం వల్ల రక్తశుద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. మరుగుతున్న నీటిలో పసుపు కలిపి ఆవిరి పట్టడం వల్ల జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.

చిన్న గ్లాసు నీళ్ళలో ఒక పసుపు కొమ్ము వేసి, రాత్రంతా నానబెట్టి, పొద్దున లేచాక పసుపు కొమ్ము తేసివేసి, ఆ నీళ్ళని స్పూన్ తో బాగా కలియబెట్టి పరగడుపున తాగడం ద్వారా మధుమేహము, రక్తపోటు, కొలస్ట్రాల్ ను సైతం అదుపులోకి తెచ్చుకోవచ్చు.

పసుపు దుంప ముద్దగా దంచి తలపై రాసుకోవడం ద్వారా తలతిరుగుడు సమస్యనుంచి ఉపశమనం పొందవచ్చు. దెబ్బలు తగిలి గాయమైనపుడు జరిగే రక్త స్రావాన్ని ఆపుడంలో పసుపు దోహదపడుతుంది.

ఏదైన షాకింగ్ వార్తలు వినడం వల్ల, మానసికంగా కృంగుబాటుకు గురయిన సందర్భాలలో ఒక కప్పు వేడిపాలలో రెండు చెంచాల పసుపు, రెండు చెంచాల నెయ్యి కలిపి తాగిస్తే ఆ షాకింగ్‌ న్యూస్‌ నుంచి తెరుకుంటాం అని వైద్యులు చెబుతున్నారు.