బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 55 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఈ వారం ఎలిమినేషన్లో భాగంగా ఇంటి సభ్యులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. ఈ వారం డైరెక్ట్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి…సూర్యను ఎలిమినేట్ చేశారు. ఆడవారితో సూర్య మాట్లాడిన విధానం బాగాలేదని క్లాస్ పీకారు. సూర్యాని పట్టుకుని ఇనయ వెక్కి వెక్కి ఏడ్చింది.
ఇక కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఇచ్చిన చేపల చెరువు టాస్క్ విషయంలో హౌస్మెట్స్ ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు నాగార్జున. ఆదిరెడ్డితో మాట్లాడుతున్నప్పుడు గీతూ రావడంతో ఆమెపై సీరియస్ అయ్యారు నాగ్. గీతు సంచాలక్‌గా చేసిన తప్పుకి ఆమెకి శిక్ష వేయాలని కెప్టెన్ శ్రీహాన్‌ని ఆదేశించాడు. దాంతో గీతూని కిచెన్‌లోని పాత్రలని క్లీన్ చేయాల్సిందిగా కెప్టెన్ ఆదేశించాడు. అయితే తనకు ఓసీడీ ఉందని ఆ పని చేయలేనని చెప్పగా బాత్రూమ్లని క్లీన్ చేయమని కెప్టెన్ ఆదేశించగా.. గీతూ అంగీకరించింది.
బాలాదిత్య, ఇనయ, పైమా, రాజ్, శ్రీసత్య ఆటతీరుని మెచ్చుకున్న నాగార్జున.. రేవంత్ గేమ్‌ని మెచ్చుకుంటూనే ఓ చురక కూడా వేశాడు. చేపల చెరువు టాస్క్‌లో ఒక్కో జంట తమ సహచర కంటెస్టెంట్‌కి మార్క్‌లు ఇవ్వాలని నాగార్జున సూచించగా.. గీతు, ఆదిరెడ్డి జంట తప్ప మిగిలిన అన్ని జంటలూ కనీసం 8-10 మార్కులు ఇచ్చుకుంటూ వెళ్లాయి.
ఇవి కూడా చదవండి..