BB6..ఇంటి సభ్యులకు అదిరే సర్‌ప్రైజ్!

79
Bigg boss telugu 6
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 79 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని పంపి అదిరే సర్‌ప్రైజ్ ఇచ్చారు.

తొలుత బిగ్‌బాస్ కోచింగ్ సెంటర్ నడిపించమని టాస్క్ ఇచ్చారు. ఇందులో ఫైమా ఇంగ్లీష్‌ టీచర్‌, ఆదిరెడ్డి డాన్సింగ్ టీచర్, శ్రీ సత్య మేకప్‌ టీచర్‌, రాజ్‌ సింగింగ్‌ టీచర్‌ కాగా మిగిలిన వాళ్ళని స్టూడెంట్స్ గా చేయమన్నారు. ఈ టాస్క్‌ ఫన్నీగా సాగింది.

ఈ టాస్క్ అనంతరం ఆదిరెడ్డి భార్య కవిత, కూతురుని ఇంట్లోకి పంపించి సర్‌ప్రైజ్‌ చేశారు బిగ్‌బాస్ . దీంతో భార్యని, కూతురుని చూసి ఫుల్ ఆనందించాడు ఆదిరెడ్డి. తన భార్యతో సరదాగా కబుర్లు చెప్పాడు. తన కూతురితో ఆడుకున్నాడు. తన కూతురి మొదటి పుట్టినరోజుకి బిగ్‌బాస్ లోనే ఉండటంతో బిగ్‌బాస్ కేక్ పంపించి ఆదిరెడ్డి కూతురి పుట్టిన రోజుని సెలబ్రేట్ చేశాడు.

ఆ తర్వాత రాజ్ వాళ్ళ అమ్మ బిగ్‌బాస్ హౌజ్ లోకి వచ్చింది. దీంతో రాజ్ ఎమోషనల్ అయ్యాడు. రాజ్ వాళ్ళ అమ్మ కూడా అందర్నీ అభినందించింది. ఫ్యామిలీస్ రాని వాళ్ళు తమ ఫ్యామిలీలని తలుచుకొని బాధపడ్డారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -