BB6…కన్నీళ్లు పెట్టుకున్న రేవంత్!

147
BB6
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 39 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా రేవంత్ కన్నీటి పర్యంతం కాగా రేవంత్ – ఆదిరెడ్డి మధ్య జరిగిన సంభాషణ చాలా ఘోరంగా కనిపించింది.

ముందుగా బాలాదిత్య.. తన భార్యతో ఫోన్ మాట్లాడి ఆ ఎమోషన్స్‌ని ఇంటి సభ్యులతో పంచుకుని కన్నీళ్లు పెట్టుకోగా ఆర్జే సూర్య దీనిపై సెటైర్ వేశారు. ఆర్జే సూర్య.. ఇనయతో ఎప్పటిలాగే రచ్చ రచ్చ చేశారు. అమ్మతో ఫోన్‌ మాట్లాడుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చి….ఐ లవ్యూ అమ్మా.. నాకేం కోపం లేదు.. నిన్ను బాగా మిస్ అవుతున్నాను తెగ యాక్టింగ్ చేశారు.

ఇక తర్వాత రేవంత్ దగ్గరికి వెళ్లిన ఆదిరెడ్డి…మధ్యాహ్నం పూట రైస్ కాస్త ఎక్కువ పెట్టండి.. రైస్ సరిపోవడం లేదు అని అడగ్గా వాదించడం మొదలెట్టాడు రేవంత్. బియ్యం ఎక్కువ ఉన్నాయి కదా అని ఆదిరెడ్డి అనగా రైస్ వేస్ట్ కాకూడదని రేవంత్ చెప్పారు. మీ కెప్టెన్సీలో అన్నం లేక ఇబ్బంది పడటం మీకు ఇష్టమా? అని అడగ్గా రేవంత్ సీరియస్ అయ్యారు.

ఇక తర్వాత బ్యాటరీ రీచార్జ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు బిగ్ బాస్. రోహిత్, వాసంతిలలో ఒకరికి ఆ అవకాశం ఇవ్వగా రోహిత్ నేరుగా నామినేట్ అయ్యారు.రీచార్జ్ అయిన అనంతరం తొలి ఫోన్ కాల్ రేవంత్ తీసుకోగా అతనికి రెండు ఆప్షన్స్ ఇచ్చారు బిగ్ బాస్. మీ భార్య సీమంతానికి మీరు పంపిన వస్తువులు ఇంటికి చేరిన వీడియో చూడాలనుకుంటే ఇంటి బ్యాటరీ 25 శాతం ఖర్చు అవుతుంది. లేదంటే.. మీ భార్య ఫొటో కావాలంటే 10 శాతం బ్యాటరీ ఖర్చు అవుతుంది.. ఈ రెండింటిలో ఏది కావాలో చెప్పండని బిగ్ బాస్ కోరడంతో.. మిగిలిన వాళ్లకి అవకాశం కల్పిస్తూ.. భార్య ఫొటో చాలు అని చెప్పి ఎమోషనల్ అయ్యారు రేవంత్.

- Advertisement -