బిగ్ బాస్ 5: ఎపిసోడ్ 98 హైలైట్స్

135
- Advertisement -

బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో హోస్ట్‌ నాగార్జున ఇంటి సభ్యులకు గట్టి టాస్కులు ఇస్తున్నాడు. శ‌నివారం రోజు తాము రిగ్రెట్ అయిన విష‌యాల గురించి ఇంటి సభ్యులు నాగార్జున‌తో పంచుకుంటున్నారు. ఈ క్ర‌మంలో మాన‌స్.. 4వ వారంలో కెప్టెన్సీ కోసం బరువు తగ్గాం, చాలా కష్టపడ్డాం. అప్పుడు సన్నీ,నేను ఇద్దరిలో ఎవరు కెప్టెన్సీకి పోటీపడాలా అని ఆలోచించుకున్నాక సన్నీకి అవకాశమిచ్చాను. అయితే హౌస్‌లో ఎక్కువ కత్తిపోట్లు సన్నీకే పడ్డాయి. ఏ కారణం లేకుండానే అందరూ కత్తితో పొడిచేస్తున్నారు. ఆరోజు నేనే పోటీకి వెళ్లుంటే వాడు అలాంటి స్థితి ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండేది అనిపించింది’ అన్నాడు.

ఇక శ్రీరామ్‌.. 4వ వారంలో ఎవరి వంట వాళ్లు వండుకోవాలి అన్న గొడవ జరిగింది. ఆ తర్వాత నేను చాలా డల్‌ అయ్యాను. ఇంట్లో వాతావ‌ర‌ణం నా వ‌ల్ల‌నే డిస్ట్ర‌బ్ అయిందా అని హ‌ర్ట్ అయ్యాను. అదీ కాక నాతో క్లోజ్ గా ఉన్న‌వాళ్లు ఒక్కొక్క‌రుగా వెళ్లిపోవ‌డం కూడా కొంచెం బాధించి డ‌ల్ అయిపోయాను అంటూ శ్రీరామ్ చెప్పుకొచ్చాడు. ఇక సిరి.. 11వ వారంలో షణ్నుతో గొడవపడి తల బాదుకోవడం తప్పనిపించిందని చెప్పుకొచ్చింది.

అనంతరం నాగ్‌ మరో గేమ్‌ ఆడించాడు. ఈ పద్నాలుగువారాలను పరిగణనలోకి తీసుకుని ఎవరు హిట్‌ స్టార్‌? ఎవరు ఫ్లాప్‌ స్టార్‌? చెప్పాలన్నాడు. ముందుగా కాజల్‌.. సన్నీకి హిట్‌ స్టార్‌, షణ్నుకి ఫ్లాప్‌ స్టార్‌ అన్న ట్యాగ్‌నిచ్చింది. శ్రీరామ్‌.. సన్నికీ హిట్‌, కాజల్‌కు ఫ్లాప్‌ స్టార్ ఇచ్చాడు. సన్నీ.. మానస్‌కు హిట్‌, షణ్నుకి ఫ్లాప్‌ స్టార్‌ అన్న ట్యాగ్‌నిచ్చాడు. కానీ పద్నాలుగు వారాలను పరిగణనలోకి తీసుకోవాలని అని చెప్ప‌డంతో సిరికి ట్రాన్స‌ఫ‌ర్ చేశాడు. ఇక సిరి షణ్నును హిట్‌, సన్నీని ఫ్లాప్‌ స్టార్‌గా పేర్కొంది. మానస్‌.. సన్నీకి హిట్‌, షణ్నుకు ఫ్లాప్‌ స్టార్‌ ట్యాగ్‌ ఇచ్చాడు. షణ్ముఖ్‌.. సిరికి హిట్‌, కాజల్‌కు ఫ్లాప్‌ స్టార్‌ బిరుదునిచ్చాడు.

- Advertisement -