తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి జయరామ్..

24

ఆదివారం తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి గుమ్మనూరు జయరామ్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఆలయం వెలుపల మంత్రి జయరామ్ మీడియాతో మాట్లాడుతూ.. శృంగేరి మఠంలో తమ్ముడి కుమార్తె వివాహం జరగనుందన్నారు. వివాహ మహోత్సవానికి ముందుగా దైవ దర్శనం చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో ఉండాలని.. 5 కోట్ల ప్రజలకు సేవలందించాలని ప్రార్ధించానన్నారు.