బిగ్ బాస్..ఎప్పుడూ ప్రారంభంకానుందంటే..!

68
bb5

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు నాలుగు సీజన్‌లు పూర్తి చేసుకోగా 5వ సీజన్‌కు నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. కరోనా నేపథ్యంలో కంటెస్టెంట్స్ ఎంపిక ప్ర‌క్రియ‌ను జూమ్ ద్వారా పూర్తి చేసిన‌ట్టు తెలుస్తుండ‌గా, బిగ్ బాస్ సెట్‌కి సంబంధించిన ప‌నులు కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది.

జూలై, ఆగస్టులో అన్ని పనులన్నీ సిద్ధం చేసుకొని.. సెప్టెంబరులో షో మొదలు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో త్వరలో షూటింగులు కూడా ఓపెన్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో బిగ్ బాస్ షూటింగ్ కూడా మొద‌లు పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.