బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. 45వ రోజు ఎపిసోడ్‌లో షాలిని రీఎంట్రీ, రోహిత్ ఎమోషన్స్, డెస్టినీ బాక్స్ టాస్క్ ప్రేక్షకులకు వినోదంతో పాటు ఉత్కంఠను పంచాయి. ముఖ్యంగా ఎలిమినేషన్ ముప్పు తప్పించుకునేందుకు కంటెస్టెంట్లు పడిన కష్టాలు హైలైట్‌గా నిలిచాయి.
కన్ఫెషన్ రూమ్‌లో ఉన్న షాలినిని తీసుకురావాలని త్రిగుణ్‌కు బిగ్‌బాస్ సూచించారు. దీంతో ఇద్దరూ కలిసి రోహిత్‌ను ఫ్రాంక్ చేశారు. షాలినిని చూసిన రోహిత్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై ఆనందంతో ఆమెకు ముద్దు పెట్టుకున్నాడు. మరోవైపు, షాలిని తిరిగి రావడంతో ఇంటి సభ్యులు షాక్ అయ్యారు. త్రిగుణ్ తన భార్య, కూతురిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. రాంప్రసాద్ మాత్రం షాలిని రాకపై కామెడీ స్కిట్‌తో అందరినీ నవ్వించాడు.
ఈ వారం ఆడియన్స్ ఓటింగ్‌తో పాటు సడన్ ఎలిమినేషన్ కూడా ఉంటుందని బిగ్‌బాస్ ప్రకటించాడు. కంటెస్టెంట్లను గ్రీన్, ఎల్లో, రెడ్ లెవల్స్‌గా విభజించాడు. గ్రీన్ లెవల్‌లో ఉన్నవారు సురక్షితంగా ఉండగా, ఎల్లోలో ఉన్నవారికి ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ ముప్పు ఉంటుంది. రెడ్ లెవల్‌లో ఉన్నవారికి మాత్రం సడన్ ఎలిమినేషన్ ప్రమాదం కూడా ఉంటుందని వెల్లడించాడు.
రెడ్ లెవల్‌లోని సభ్యులకు డెస్టినీ బాక్స్ టాస్క్ నిర్వహించారు. బోన్‌ను దక్కించుకుని బాక్స్ తెరిచినవారికి వచ్చే రంగును బట్టి ఇతరులను ఆట నుంచి తొలగించే అవకాశం లభించింది. శ్వేత మొదట వంశీని తొలగించగా, రాంప్రసాద్ రోహిత్, రామకృష్ణలను ఆట నుంచి తప్పించాడు. అనంతరం సుధీర్, ఝాన్సీ, శ్వేత, షాలిని మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
Also Read:లిక్కర్ ఎంత తాగితే మంచిది?
టాస్క్ సందర్భంగా షాలిని, దక్షి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో బిగ్‌బాస్ బీప్ వేయాల్సి వచ్చింది. చివరకు పలుమార్లు పోటీ పడిన రాంప్రసాద్ పసుపు రంగు సాధించి ఎల్లో లెవల్‌లోకి చేరాడు. దీంతో అతడికి తాత్కాలికంగా ఊరట లభించింది. అనంతరం ఇంటి సభ్యులకు దసరా స్వీట్లు అందించడంతో ఎపిసోడ్ ముగిసింది.

