బిగ్ బాస్ 4..ఎపిసోడ్ 77 హైలైట్స్

195
episode 77
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 77 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 77వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యులకు సర్ ప్రైజ్‌లు ఇచ్చారు నాగ్. మరోసారి ఇంటి సభ్యులతో స్టేజ్ మీద నుండి మాట్లాడే అవకాశం కల్పించారు. అలాగే ఈ వారం ఎలిమినేషన్‌లో తొలి కంటెస్టెంట్‌గా సొహైల్ సేవ్ అయ్యారు.

ఎవ‌రు టాప్ 5లో ఉంటారో అంచ‌నా వేయ‌మ‌ని ఇంటి సభ్యులను కోరారు. అయితే కుటుంబ స‌భ్యుల‌ను క‌లుసుకునేందుకు నాగ్ కంటెస్టెంట్ల‌కు బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించారు. త‌ను అడిగే ప్ర‌శ్న‌ల‌కు సూటిగా స‌మాధానాలు చెప్తే వారి ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో మాట్లాడిస్తాన‌ని చెప్పారు. దీనికి ఇంటిస‌భ్యులు స‌రేనంటూ

మొద‌ట‌గా హారిక వంతు రాగా.. నువ్వు టాప్ 2లో ఉంటే ఎవ‌రు నీతో పాటు ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌వు అని ప్ర‌శ్నించగా అవినాష్ పేరును చెప్పింది. దీంతో హారిక అన్న‌య్య‌, స్నేహితుడు స్టేజీపైకి వ‌చ్చారు. ఎవ‌రు టాప్ 5లో ఉంటారో చెప్ప‌మ‌న‌గా హారిక‌, అభిజిత్‌, లాస్య‌,సోహైల్‌, అరియానా పేర్లు చెప్పారు.బిగ్‌బాస్ ఇంట్లో ముందు ఒక‌లాగా, వెన‌క ఒక‌లాగా ప్ర‌వ‌ర్తించేది ఎవ‌రు అన్న ప్ర‌శ్న‌కు అభిజిత్ అని అఖిల్ ఆన్స‌ర్ ఇచ్చాడు. ఈ క్ర‌మంలో మ‌రోసారి ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. తర్వాత అఖిల్ అన్న బ‌బ్లూ‌, ఆయ‌న‌ కొడుకు అరుష్‌ స్టేజీ మీద‌కు వ‌చ్చారు. సోహైల్‌, అఖిల్‌, అభిజిత్‌, అరియానా, అవినాష్‌ టాప్ 5లో ఉంటార‌ని తెలిపారు.

అరియానా చెల్లి టాప్ 5లో అరియానా, అఖిల్‌, సోహైల్‌, హారిక‌, అవినాష్ ఉంటార‌ని చెప్పుకొచ్చారు. తర్వాత లాస్య త‌ల్లి శాంత‌మ్మ‌ త‌న కూతురు బాగా ఆడుతుందని తెలపగా లాస్య‌, అభిజిత్‌, సోహైల్‌, అఖిల్‌, హారిక టాప్ 5లో ఉంటార‌ని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లాక ఇంటిస‌భ్యుల్లో ఎవ‌రితో స్నేహాన్ని కొన‌సాగించ‌వు? అన్న ప్ర‌శ్న‌కు సోహైల్ అభిజిత్ పేరు చెప్పాడు. సొహైల్ బ్ర‌ద‌ర్‌ స‌బిల్‌, రామారావు స్టేజీ మీద‌కు వ‌చ్చారు. సోహైల్‌, అభిజిత్‌, అఖిల్‌, అవినాష్‌, అరియానా టాప్ 5లో ఉంటార‌ని చెప్పుకొచ్చారు. రాత్రి తొమ్మిది త‌ర్వాత నుంచి ఒంటి గంట వ‌ర‌కు సోహైల్‌‌ అమ్మాయిల‌తో ఛాటింగ్ చేస్తాడ‌ని చెప్పడంతో అంద‌రూ షాక‌య్యారు.

పోయిన వారం మెహ‌బూబ్‌కు బ‌దులు ఎవ‌రు ఎలిమినేట్ కావాల్సింది అన్న ప్ర‌శ్న‌కు మోనాల్ అని అభి స‌మాధాన‌మిచ్చాడు. టాప్ 5లో అభిజిత్‌, సోహైల్‌, హారిక‌, అఖిల్‌, మోనాల్ ఉంటార‌ని అభి తండ్రి,మామ తెలిపారు. ఇక అవినాష్ సమాధానానికి ఇంప్రెస్ కానీ నాగ్ ఆయనకు కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ నుండి సొహైల్ సేవు అయినట్లు ప్రకటించారు.

- Advertisement -