బీజేపీ బోగస్…కాంగ్రెస్ కక్కుర్తి పార్టీ:మంత్రి ఎర్రబెల్లి

23
errabelli

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాచారం డివిజన్ లోని ck గార్డెన్ లో జరిగిన ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు, బూత్ ఇంచార్జీ లతో జరిగిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా బీజేపీ నుంచి సాయికృష్ణ, కాంగ్రెస్ నుంచి మైనారిటీ నేత జాకీర్ నేతృత్వంలో, సామాజిక కార్యకర్త శంకర్ నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు, ముఖ్య నేతలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఈ ఎన్నికల నాచారం డివిజన్ ఇంచార్జీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు.ఈ సందర్భంగా వాళ్లందరినీ గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు మంత్రి ఎర్రబెల్లి. రెబెల్ అభ్యర్థి గా నామినేషన్ వేసిన చిల్లా పద్మావతి అశోక్ ముదిరాజ్ ను బుజ్జగించి, పార్టీ సమావేశానికి రప్పించిన మంత్రి, ఎమ్మెల్యేలు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి …దోమల కేంద్రంగా ఉన్న నాచారాన్ని దోమల రహితంగా, పరిశుభ్రంగా, అభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదే అన్నారు. నాచారం డివిజన్ ఇప్పటి కంటే, రెట్టింపు అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు…..ఇక్కడ 100కు పైగా కోట్లతో అభివృద్ధి జరిగిందన్నారు. సిట్టింగ్ అభ్యర్థి శాంతి సాయి జన్ శేఖర్ మంచి ప్రగతిని చూపెట్టారని తెలిపారు.

మరింత అభివృద్ధి సాధించాలంటే శాంతిని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని…మీకు అండగా నేను, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి ఉంటాం అన్నారు. మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలి….అరేండ్ల లో 67వేల కోట్లు, ghmc నుంచి 36వేల కోట్లు హైదరాబాద్ అభివృద్ధి కి ఖర్చు చేశాం అన్నారు.

హైదరాబాద్ ని విశ్వ నగరంగా తీర్చిదిద్దుతున్నారు…సీఎం కెసిఆర్, మంత్రి ktr లు చొరవతో అభివృద్ధికి పూనుకున్నారు…దేశంలో వరదల్లో చిక్కుకున్న చరిత్ర మీకుందా?…పైగా మీరు వరద నష్టాలను ప్రజలకు అందకుండా చేస్తారు…వరదల్లో బురద రాజకీయాలు చేస్తున్నారు…కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందే అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రానికి సమస్యలుగా పరిణమించాయి…ఆ పార్టీలను ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి…మనం కూడా బీజేపీ తరహా లో సోషల్ మీడియా ను వాడుకోవాలి. తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలి…శవ రాజకీయాలు చేసి, దుబ్బాకలో గెలిచారు..వారు గెలవడం కోసం ఎంతకైనా దిగజారుతారు..బీజేపీ అంటేనే, బోగస్ పార్టీ..కాంగ్రెస్ పార్టీ అంటే కక్కుర్తి పార్టీ అని మండిపడ్డారు.