Bigg Boss 8 Telugu : దుమ్ము రేపిన రోహిణి..

2
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 82 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో దుమ్ము రేపిన రోహిణి మెగా చీఫ్ గా నిలిచింది. న్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య ఆటో టాస్క్ పెట్టగా తేజ, రోహిణి, యష్మీ, విష్ణు ప్రియా, పృథ్వీ ఈ టాస్క్ ఆడారు. ఒకరినొకరు తోసుకుంటూ చివరకు రోహిణి విజేతగా నిలిచింది.

ఇక ఫైనల్ గా కుండ జాగ్రత్త అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. రోహిణి, పృథ్వీ, తేజ ఈ గేమ్ ఆడారు. ఈ టాస్క్ లో రోహిణి దుమ్ము రేపింది. ఈ టాస్క్ లో ఓ వైపు కుండ పెట్టి మరో వైపు కాలుతో బ్యాలెన్ చేయాలి. మిగిలిన వాళ్లు తమకు నచ్చిన వారి కుండలో ఇసుకపోయాలి.. దాని బరువును కాలుతో బ్యాలెన్స్ చేయాలి. ఈ టాస్క్ లో ముందుగా తేజ అవుట్ అయ్యాడు.

ఆతర్వాత పృథ్వీ చాలా బాగా ఆడాడు.. కానీ చివరిలో వదిలేశాడు. చివరకు రోహిణి విన్నర్ గా నిలిచి.. మెగా చీఫ్ అయ్యింది. దాంతో ఒక్కసారిగా రోహిణి ఎమోషనల్ అయ్యింది. నేను జీరోని కాదు హీరోని అంటూ గట్టిగా అరుస్తూ ఎమోషనల్ అయ్యింది రోహిణి. గౌతమ్ రోహిణిని భుజాలపై ఎత్తుకొని సెలబ్రేట్ చేశాడు.

Also Read:Bigg Boss 8 Telugu:మెగా చీఫ్‌గా రోహిణి

- Advertisement -