బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు 13వ వారం నామినేషన్స్ ఆసక్తికరంగా సాగాయి. తాజా ఎపిసోడ్లో భాగంగా నబీల్-గౌతమ్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ వారం అల్లావుద్దీన్ అద్భుతదీపం టైపులో ఈ నామినేషన్స్ జరిగాయి. మీరు ఎవరినైతే ఫైనలిస్ట్‌గా చూడొద్దనుకుంటున్నారో ఆ ఇద్దరు సభ్యులను నామినేట్ చేయాల్సి ఉంటుంది.. అలా నామినేట్ అయిన సభ్యుడ్ని ఆ దీపం ముందు నిల్చోబెట్టాలి.. అందులోనుంచి కలర్ వారి ముఖంపై పడుతుందని చెప్పాడు బిగ్ బాస్.
ముందుగా గౌతమ్‌ని నామినేట్ చేశాడు నబీల్. నామినేషన్స్‌లో ఫైర్ చూపిస్తున్నావ్ కానీ గేమ్‌లో నాకు నీ ఫైర్ కనిపించట్లేదు.. అంటూ రీజన్ చెప్పాడు. దీనికి గౌతమ్ కృష్ణలో కూడా ఫైర్ ఉంది.. గ్రాములు కిలోలు లెక్క కాదు టన్నుల టన్నుల లెక్క ఉంది అంటూ అరిచాడు. నాకు పాయింట్ కనిపించింది కాబట్టి రుబాబ్సే చెబ్తున్నా అని నబీల్ అనగా నువ్వు జెన్యూన్ కాదు అంటూ గౌతమ్ హిందీలో అన్నాడు. దీంతో నేను జెన్యూన్ అది నాకు తెలుసు.. అంటూ నబీల్ కూడా అరిచాడు.
తర్వాత తన రెండో నామినేషన్ విష్ణుప్రియకి వేశాడు నబీల్. తర్వాత పృథ్వీ…అవినాష్‌నే నామినేట్ చేయగా లక్ వల్ల ఇక్కడ గెలిచే వాళ్లు నాకిష్టం లేదు అన్నాడు. అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అంటూ రీజన్ చెప్పాడు పృథ్వీ. దీనికి రెండు సార్లు మెగా చీఫ్ అయ్యాను అంటూ తొడకొట్టి మరీ చెప్పాడు అవినాష్.
కొద్దిసేపటికి బిగ్ బాంబ్ అనే పేరుతో ఎలిమినేట్ అయిన యష్మీకి నాగార్జున పవర్ ఇచ్చారు. నిఖిల్-గౌతమ్‌లో ఒకరిని యష్మీ డైరెక్ట్‌గా నామినేట్ చేయాల్సి ఉంటుందని చెప్పగా యష్మీ…ఈ వారం నిఖిల్ నామినేషన్స్‌కి వెళ్లి సేవ్ అయి వచ్చాడు.. గౌతమ్ కూడా వెళ్లాలని తనని నామినేట్ చేస్తున్నా అంటూ చెప్పింది. దీంతో ఆటోమేటిక్‌గా గౌతమ్ నామినేషన్స్‌లోకి వచ్చేశాడు.
Also Read:NRI BRS:యూకే నూతన అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి