Bigg Boss 7:కోట బొమ్మాలితో బిస్ బాస్

76
- Advertisement -

బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 77 రోజులు పూర్తి చేసుకుంది. ఇక 11వ వారం నో ఎలిమినేషన్ అని ప్రకటించగా ఇక సన్ డే ఫన్ డేలో భాగంగా మంచి ఊపు మీదున్న మాస్ పాటతో ఎంట్రీ ఇచ్చారు నాగార్జున.తొలుత యావర్ సిగరెట్ తాగుతూ ఉండగా శోభా అక్కడికి వెళ్లి మాట్లాడింది. గ్రేట్ డెసిషన్ యావర్.. నువ్వు తప్పు చేశావని తెలియగానే ఎవిక్షన్ పాస్ ఇచ్చేశావ్ చూడు.. ఐ లైక్ యూ యావర్ అంటూ శోభా మెచ్చుకుంది. ఇక తర్వాత కిచెన్ దగ్గర ప్రియాంక కూడా యావర్‌ను తెగ పొగిడింది. తర్వాత హౌస్‌మెట్స్ అందరికీ హాయ్ చెప్పారు నాగార్జున.

నిన్న శివాజీతో క్షమాపణ నాగ్ క్షమాపణ చెప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాట్లాడిన శివాజీ…నిన్నటి నుంచి నాకు గిల్టీగా ఉంది. ఆ బూతు మాటలు ఆడినందుకు సారీ బాబు గారూ.. వాంటెడ్‌గా అనలేదు అని చెప్పారు. తర్వాత గౌతమ్‌ని పైకి లేపి… అమర్ ఆడేటప్పుడు నీ యమ్మా అని నువ్వు అన్నావ్.. అది ఏదో ఊతపదం అనేలా నువ్వు జస్టిఫై చేసుకోవచ్చు. కానీ పిల్లలు చూస్తుంటారు కదా టీవీ.. చూసుకో అంటూ చెప్పగా గౌతమ్ కూడా సారీ చెప్పేశాడు.

తర్వాత యాడ్ ఏ ఫ్రెండ్.. బ్లాక్ ఏ హౌస్ మెట్ అంటూ ప్రతి కంటెస్టెంట్ ఒక కొత్త ఫ్రెండ్‌కి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ వేయాలి, అలానే ఒకరిని బ్లాక్ చేయాలి అని చెప్పారు. తొలుత గౌతమ్.. ప్రశాంత్‌ను ఫ్రెండ్ అని ,శోభాను బ్లాక్ చేస్తున్నా అని చెప్పాడు. తర్వాత అమర్‌ కూడా ప్రశాంత్‌కే ఫ్రెండ్ షిప్ బ్యాండ్ వేయగా వే రతికను బ్లాక్ చేస్తున్నట్లు చెప్పాడు. ఇలా ఒక్కొక్కరు చెప్పే కార్యక్రమం పూర్తి కాగా తర్వాత సన్ డే కావడంతో కోట బొమ్మాళి పీఎస్ టీంను పలిచారు.

హీరో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌కుమార్, శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్ వచ్చారు. సినిమా గురించి విశేషాలు అడిగి తెలుసుకున్నారు నాగ్. ఇక బిగ్‌బాస్ చూస్తారా అని నాగ్ అడగ్గానే శ్రీకాంత్ సూపర్ ఆన్సర్ ఇచ్చాడు. శోభా శెట్టి ఒక క్రాకర్‌లా.. ఆటం బాంబులా ఆడుతుందని శ్రీకాంత్ అన్నాడు. యావర్.. తెలుగు రాకుండా అదే ఫైర్‌లో ఆడుతున్నావంటే హ్యాట్సాఫ్ అంటూ మెచ్చుకున్నాడు. ఇలా మొత్తంగా సన్ డే ఫన్‌ డేగా సాగింది.

Also Read:ఫైనల్లో నిరాశపర్చిన రోహిత్ సేన..

- Advertisement -