బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 7 విజయవంతంగా 71 రోజులు పూర్తి చేసుకుంది. ఈ వారం హౌస్ నుండి భోలే ఎలిమినేట్ కాగా ఇక 11 వారం నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. నామినేషన్స్ ప్రక్రియ మొదలయ్యే ముందు రతికకి సలహా ఇచ్చాడు శివాజీ. ఆ సలహాతో శివంగిలా రెచ్చిపోయింది. ఇక నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరూ వారు నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరి తలపై బాటిల్ పగలగొట్టాలని చెప్పారు బిగ్ బాస్.
తొలుత రతిక వంతు రాగా మందుగా శోభా శెట్టిని నామినేట్ చేసింది రతిక. నీ కెప్టెన్సీ నచ్చలేదు, నాకు లాస్ట్ వీక్ నువ్వు చేసిన నామినేషన్‌లో రీజన్ నచ్చలేదు.. అంటూ చెప్పింది. దీంతో రతిక – శోభాశెట్టి మధ్య పెద్ద గొడవ జరిగింది.తర్వాత తన రెండో నామినేషన్‌కి ప్రియాంకని సెలక్ట్ చేసింది. రతిక చెప్పిన పాయింట్లు అన్నీ సిల్లీగా ఉన్నాయంటూ ప్రియాంక వాదించింది. అయితే రాజమాతల ప్రక్రియలో నువ్వు-శోభా తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనుకుంటున్నావా అంటూ రతిక అడిగింది. అవును కరెక్టే అందుకే నాగార్జున సార్ మమ్మల్ని ఏం అనలేదు మొన్న వీక్ అంటూ ప్రియాంక చెప్పింది.
తర్వాత ప్రశాంత్‌ని నామినేట్ చేశాడు అర్జున్. నీలో అన్నీ బావుంటాయిరా.. నిన్న కూడా అందరూ చెప్పారు కదా.. అయితే ఏదైనా గేమ్‌లో ఓడిపోయినప్పుడు నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు అందుకే నామినేట్ చేశానని చెప్పాడు. తర్వాత సెకండ్ నామినేషన్ శోభా శెట్టికి వేశాడు అర్జున్. నీకు కెప్టెన్ అవ్వాలనే కసి.. నీకు అయ్యాక లేదు…ఏం ఆడకుండా కెప్టెన్ అయిపోతే అలానే ఉంటుంది అంటూ ఫైర్ అయ్యి కోపంగా శోభా నెత్తిన బాటిల్ పగటగొట్టాడు.
Also Read:కోటా బొమ్మాళి పీఎస్.. టైటిల్ సాంగ్
ఇక తర్వాత ప్రియాంకకి ఛాన్స్ రావడంతో రతికని నామనేట్ చేసింది. నీ నామినేషన్స్‌లో అసలు పాయింట్ లేదు అందుకే నిన్ను చేస్తున్నా అంటూ చెప్పింది. తర్వాత తన రెండో నామినేషన్ అశ్వినికి వేసింది ప్రియాంక. తర్వాత గౌతమ్…అర్జున్,అమర్‌లని నామినేట్ చేశాడు. కెప్టెన్సీ టాస్కులో నువ్వు గెలవాలని ఆడి ఉంటే బావుండేది.. అలా వేరే వాళ్లు ఓడిపోవాలని ఆడావ్.. కరెక్ట్ అనిపించలేదు అంటూ అమర్‌ని నామినేట్ చేశాడు.