KCR:కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆగం అవుతాం

55
- Advertisement -

ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో జరిగిన భద్రాచలం, పినపాక నియోజకవర్గాల బీఆర్‌ఎస్‌ ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. సీతారామ ప్రాజెక్టు మీ కండ్ల ముందే జరుగుతుందన్నారు.

గోదావరి నుంచి మన ఇష్టమునన్ని నీళ్లు తీసుకోవచ్చు. ఎలెక్షన్లు రాగానే ఆగం అవ్వకూడదు. ఏ పార్టీ వైఖరి ఏంటి.. ఎవరి నీతి ఏంది? ఎవరిని నిలబెడితే ప్రజలం నిలుబడుతాం అని ఆలోచన చేసి ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులు రేగా కాంతారావు, తెల్లం వెంకట్రావు లను భారీ మెజారిటీలతో గెలిపించాలని కోరారు.

కాంగ్రెసోళ్లు రైతులకు 24 గంటలు కరెంటు వేస్ట్ అంటున్నరు.. మూడు గంటల కరెంటు చాలు అంటున్నరు. కాంగ్రెస్ ఓటేస్తే అదే అవుతది. మూడు గంటల కరెంటుతో పొలాలు పారుతయా? ఆలోచించాలన్నారు. బాధ్యతలేని కాంగ్రెస్ పార్టీ, రైతుల మీద సానుభూతి లేని కాంగ్రెస్ పార్టీ ధరణి తీసేస్తా అంటున్నది. ధరణి తీసేస్తే రైతుబంధు సొమ్ము, రైతు బీమా సొమ్ము, రుణ మాఫీ సొమ్ము, ధాన్యం అమ్మకానికి సంబంధించిన డబ్బు రైతులకు నేరుగా ధరణి లేకుండా ఎలా అందుతుందనేది నేను ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు జవాబు చెప్పడం లేదన్నారు.

Also Read:Allu Arjun:’మంగళవారం’ టీజర్ చూసి షాకయ్యా

- Advertisement -