Bigg Boss 7 Telugu:హాట్‌ హాట్‌గా నామినేషన్స్ ప్రక్రియ‌

62
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 64 రోజులు పూర్తి చేసుకుంది. తాజా వారం సోమవారం కావడంతో నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది.నామినేషన్స్‌లో భాగంగా తొలి ప్రక్రియ రాజమాతలను పెట్టడం.ఇందులో ఓ వైపు శోభాశెట్టి, ప్రియాంక మరోవైపు రతిక, అశ్విని ఉన్నారు. ప్రతిసారి ఇద్దరు క్యాండెట్లు వెళ్లి తాము నామినేట్ చేసే పర్సన్‌ను వారి రీజన్స్‌ను చెప్పాలి. ఎవరి రీజన్ వారికి న్యాయంగా అనిపిస్తే వారి నామినేషన్లను రాజమాతలు ఏకాభిప్రాయంతో సెలక్ట్ చేయాలి. ఇందుకోసం నలుగురికి పెద్ద సింహాసనాలు ఏర్పాటు చేశారు.

​ముందుగా అమర్‌దీప్-అర్జున్ ఇద్దరూ తమ నామినేషన్స్ వేసేందుకు వచ్చారు. భోలే తాను వీక్ అని ఒప్పుకొని గత వారం మా టీమ్‌లోకి వచ్చేయడం కరెక్ట్ అనిపించలేదు అని అమర్ నామినేట్ చేయగా టీమ్ మొత్తాన్ని శివాజీ ఇన్‌ఫ్లుయెన్స్ చేశాడని ​గౌతమ్ చెప్పడం కరెక్ట్ కాదంటూ డాక్టర్ బాబును అర్జున్ నామినేట్ చేశాడు. అంతా కలిసి భోలేని నామినేట్ చేసి పడేశారు.

Also Read:రష్మిక ఫేక్ వీడియోపై కవిత ఆందోళన

తర్వాత యావర్ వచ్చి అమర్‌దీప్‌ని నామినేట్ చేశాడు. యావర్‌తో పాటు నామినేషన్‌కి వచ్చిన ప్రశాంత్.. గౌతమ్‌ని నామినేట్ చేశాడు. కెప్టెన్ అయి ఉండి నువ్వు చెప్పుడు మాటలు విని ఒక టీమ్ మీద, ఒక ప్లేయర్ (శివాజీ) మీద ఎలా అలిగేషన్స్ చేస్తావ్ అంటూ కొశ్చన్ చేశాడు. తర్వాత మళ్లీ భోలే వచ్చి అమర్‌ని నామినేట్ చేశాడు.

చివరి నామినేషన్‌గా రాజమాతలు నలుగురు ఏకాభిప్రాయంతో మీలో ఒకరిని నామినేట్ చేసుకోవాలి అంటూ చెప్పాడు. అయితే శోభా కెప్టెన్ కావడంతో ఆమె తప్ప మిగిలిన ముగ్గురిలో నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇందులో ముందుగా ప్రియాంక రతికను నామినేట్ చేసింది. తర్వాత అశ్విని కూడా ప్రియాంకనే నామినేట్ చేసింది. దీంతో శోభా వెళ్లి ఈక్వల్ చేయాలని రతికను నామినేట్ చేసింది. ఇలా మొత్తానికి రతికకి 2, ప్రియాంకకి రెండు ఓట్లు పడ్డాయి.

Also Read:టీమిండియాకు హెచ్చరికలు..!

- Advertisement -