Bigg Boss 7 Telugu:హద్దు దాటిన భోలే..బిగ్ బాస్ షాక్

52
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 44 రోజులు పూర్తి చేసుకుంది. ఇక 7వ వారం నామినేషన్స్ ప్రక్రియ ముగియగా తాజాగా ఎపిసోడ్‌లో ప్రియాంక, శోభలపై భోలే హద్దు మీరి బూతులు మాట్లాడటం, పల్లవి ప్రశాంత్ వర్సెస్ సందీప్‌ మధ్య మాటల యుద్ధంతో ఆసక్తిగా సాగింది. తొలుత శోభాతో ఎందుకు నామినేట్ చెప్పమ్మా అని భోలే అంటే.. మీరో స్టేట్ మెంట్ పాస్ చేశారు.. ఆడబిడ్డ కాబట్టి.. టాస్క్‌లో వదిలేశాను అని అది నాకు నచ్చలేదు అందుకే నామినేట్ చేశానని చెప్పగా నిన్ను చూస్తుంటే నవ్వొస్తుందన్నాడు భోలే. తర్వాత శోభా ఎదో చెప్పే ప్రయత్నం చేయగా భోలే ఇచ్చిన పంచ్‌కు శోభా మొహం వాడిపోయింది.

ఆడ బిడ్డపై లవ్వు రావాలి కానీ.. నిన్ను చూస్తుంటే నవ్వు వస్తుంది.. నేను ఆడపిల్లపై ఓడిపోయా అని పదే పదే అంటున్నావ్.. ఆటలో గెలుపు ఓటమిలు ఉంటాయి.. నువ్వు బిగ్ బాస్ మోనితగా ఉండిపోవడం చూస్తుంటే నవ్వు వస్తుందిరా? అంటూ పంచ్‌లు వస్తూనే ఉన్నారు భోలే. దీనికి శోభాశెట్టి.. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే.. అన్నం తింటున్నానంటే.. దానికి కారణం ఆ మోనితే అని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో భోలే బూతులు వాడగా…పక్కనే ఉన్న ప్రియాంక రెచ్చిపోయింది. . ఏం మాట్లాడుతున్నారు? బూతులు మాట్లాడటం ఏంటి?…ఒక ఆడపిల్ల ముందు అలాంటి మాట మాట్లాడతారా? నోరు అదుపులో పెట్టుకో అని భోలేకు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో థూ అని భోలే ముఖంపై ఉమ్మేసింది ప్రియాంక.

థూ అని ఊస్తున్నావ్.. తిరిగి నేను థూ అంటే నీ బతుకు ఏం కావాలే అని అన్నాడు. నా బతుకు ఏం కావడం ఏంటి? ముందు నీ బతుకు ఏం అవుతుందో చూసుకో అని అన్నది ప్రియాంక. భోలే.. బిగ్ బాస్ హౌస్‌లో బూతులు మాట్లాడటం ఏమాత్రం సహించబడదు.. ఇది రిపీట్ అవ్వకుండా చూసుకోండి.. ఈ డిస్కషన్ ఇక్కడితో ఆపేయండి అని హెచ్చిరించారు బిగ్ బాస్.

Also Read:మగవారు ఇవి తింటే ఎన్ని ప్రయోజనాలో..?

- Advertisement -