Bigg Boss 7 Telugu:డే17..రతిక,శోభా రచ్చరచ్చ

9
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 17 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో రతి, శోభాశెట్టి రచ్చరచ్చ చేస్తూ గబ్బుపట్టించారు. తొలుత దామిని, రతిక, తేజ ముగ్గురు కలిసి ప్రత్యక్ష నరకం చూపించినా తట్టుకొని నిలబడి టాస్క్‌లో గెలిచాడు ప్రిన్స్.

షార్ట్ టెంపర్ ఉంది హౌస్ మెట్ అవడానికి పనికారడంటూ యావర్‌ గురించి బిగ్‌బాస్‌కి చెప్పిన రతికపై అందరికీ కోపం రాగా తిరిగి ఆమెతో ప్రేమగానే మాట్లాడాడు యావర్. నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను.. నేను స్నేహం చేస్తే లాయల్‌గా ఉంటాను అని యావర్ చెప్పగా రతిక షాక్‌కు గురైంది. తర్వాత రతికకి తన చేతులతో తానే తినిపించాడు. మిగిలిన కంటెస్టెంట్స్ యావర్ చేస్తున్న పనికి షాక్‌కు గురయ్యారు. శివాజీ తన పవరాస్త్ర గురించి తెగ వెతుకుతూనే ఉన్నాడు. చివరికి రాత్రి అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టిలు పడుకొని ఉంటే అక్కడికి వెళ్లి వార్నింగ్ ఇచ్చాడు.

తర్వాత సందీప్ మాస్టర్‌తో శివాజీ తన బాధ చెప్పుకున్నాడు. ఇప్పుడు మనకి ఏమైనా ఫ్రీగా ఇచ్చారా లేదు కదా.. ఆడపిల్లలు అంతకంటే ఎక్కువ మాట్లాడలేం.. నా క్యారెక్టర్ నేను చంపుకేలేనురా సందీప్ అని తన బాధను వెళ్లగక్కాడు. తన పవరాస్త్ర దొబ్బేసింది తేజ అని అనుకున్న శివాజీ ఇక ఇండైరెక్ట్‌గా తిట్టడం మొదలుపెట్టాడు. వాడు వేస్టే ఫెలో.. వాడిది కుక్క తోక.. వాడు ఎదగడు.. రాసిపెట్టుకో.. అంటూ ప్రశాంత్‌తో అన్నాడు.

Also Read:గోదుమగడ్డి రసం తాగితే.. ఎన్ని లాభాలో!

తర్వాత ఇంట్లో ఉన్న వాళ్లందరినీ టీవీ ముందుకు పిలిచాడు బిగ్‌బాస్. ముగ్గురు నీ కంటెండర్ షిప్‌ను సవాల్ చేయడంతో నీకు ఒక టాస్క్ పెడుతున్నామంటూ యావర్‌కి చెప్పాడు బిగ్‌బాస్. గార్డెన్‌‍లో ఉంచిన స్టాండ్ మీద చిన్ పెట్టి ఉంచాలి.. ఈ ప్రక్రియలో దామిని, రతిక, తేజ మిమ్మల్ని ఏం చేసినా కూడా మీరు మీ చిన్‌ని స్టాండ్ పై నుంచి తీయడానికి వీల్లేదు గంటసేపు అలాగే ఉండాలని లేకపోతే ఓడిపోయినట్లేనని చెప్పాడు. టాస్క్ మొదలుకాగా అంపైర్లుగా సందీప్, శివాజీలు వ్యవహరించారు.

ఈ గేమ్‌లో యావర్‌ నిజంగా తనతో ఫ్రెండ్‌గా ఉన్నాడనే ఆలోచన లేకుండా రాక్షసిలా ప్రవర్తించింది రతి. శాస్త్రి బామ్.. యావర్ ముక్కు కింద మొత్తం రాసేయగా దామిని అయితే ముక్కులో పుల్ల పెట్టి తిప్పగా రతిక.. యావర్ ముక్కు మీద, కళ్ల మీద గుడ్లు పగలగొట్టింది. తర్వాత దామిని తానేని తక్కువకాదు అంటూ యావర్‌కి ఊపిరాడకుండా కంట్లో, ముక్కులో షాంపూ నురగ పోస్తూనే ఉంది. రతిక…యావర్ డ్రాయర్‌లో ఐస్ వేసేసింది. ఆవు పేడ, నీళ్లు, గడ్డి నోట్లో కొడుతూ చిత్ర హింసలు పెట్టారు. ఇలా గంటపాటు నరకం చూపించిన తర్వాత బజర్ మోగింది. దీంతో యావర్ విజేతగా నిలిచాడు.

యావర్‌కి నిన్న టీవీలో వీడియోలు చూపించినట్లు ఈసారి శోభా డిజర్వ్ కాదని చెప్పిన కంటెస్టెంట్ల వీడియోలు చూపించాడు బిగ్‌బాస్. శోభా శెట్టిని చూస్తేనే భయమేస్తుంది అందుకే ఆమె కంటెండర్‌గా అర్హురాలు కాదంటూ అందులో ప్రశాంత్ చెప్పాడు. ఇక గౌతమ్ అయితే శోభా ఎప్పుడూ ఒంటరిగా ఉంటుందని.. హౌస్‌లో అందరితోనూ కలవదని చెప్పగా శుభశ్రీ సైతం అదే చెప్పుకొచ్చింది. దీంతో వారిమాటలను విన్న శోభాకి పిచ్చెక్కిపోయింది. గౌతమ్‌ పై ఒంటికాలిపై లేస్తూ నా మేకప్ గురించి నీకెందుకు.. నువ్వు కూడా రోజూ జిమ్ చేస్తూ కండలు పెంచుతున్నావ్ కదా.. ఏం పీకావ్ మరి టాస్కుల్లో అంటూ ఫైర్ అయింది.ఈ క్రమంలో గౌతమ్ చొక్కవిప్పి తనకు అయిన గాయాన్ని చూపెట్టే ప్రయత్నం చేయగా….ఏంట్రా చొక్కా విప్పితే ఎవడూ భయపడడు.. షో చేయడానికి వచ్చావా.. అంటూ రెచ్చిపోయింది. గౌతమ్‌ని ఇష్టం వచ్చినట్లు దూషిస్తూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది.

Also Read:రాజధానిపై జగన్ ఫిక్స్?

- Advertisement -