Bigg Boss 7 Day:పుష్పలా ఎదిగిన ప్రశాంత్‌..

49
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 101 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో యావర్‌తో పాటు రైతు బిడ్డ ప్రశాంత్ జర్నీని చూపించారు. ముందుగా యావర్‌ జర్నీని చూపించిన బిగ్ బాస్… బిగ్‌బాస్ సీజన్-7లో ప్రిన్స్ యావర్ జర్నీ చాలా ప్రత్యేకం అని చెప్పాడు. ఎందుకంటే అసలు తెలుగు భాష రాకపోయినా సరే ఇన్నాళ్లు యావర్ హౌస్‌లో ఉన్నాడంటే అది గొప్ప రికార్డ్ అని చెప్పాడు. గార్డెన్ ఏరియాలో పెట్టిన తన ఫొటోలు చూసి యావర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. బ్రదర్ ఫొటో చూసి ఏడ్చేశాడు. తర్వాత యాక్టివిటీ ఏరియాలో యావర్ గురించి బిగ్‌బాస్ చెప్పిన మాటలు విని మురిసిపోయాడు.

SPY రూపంలో మీకు దొరికిన అమూల్యమైన స్నేహం కూడా మీ ప్రయాణం సాఫీగా ముందుకు కదిలేందుకు దోహదపడింది. మీ కోపం, మీ పట్టుదల మీకు తప్పు కనిపించిన ప్రతి చోటా కనిపించాయని చెప్పాడు. ఏడుస్తూ, నవ్వుతూ అక్కడ కనిపించే ప్రతి సీన్‌ను ఎంజాయ్ చేశాడు యావర్. ఇక వీడియో అయిపోగానే యావర్ చెప్పిన ఒక డైలాగ్ మాములుగా పేలలేదు. కొంతమంది అంటారు నాలో చాలా కోపం ఉందని.. కానీ నాలో చరిత్ర సృష్టించే దమ్ము ఉంది థాంక్యూ బిగ్‌బాస్ అని చెప్పాడు.

అనంతరం పల్లవి ప్రశాంత్ ఏవి చూపించారు. ఒక కామన్ మ్యాన్ గా రైతు బిడ్డ అనే ట్యాగ్ తో బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి పుష్పలా ఎదిగాడని చెప్పుకొచ్చాడు బిగ్‌బాస్. ఆ ఏవి చూసి ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రశాంత్. రైతు గర్వపడేలా చేస్తాను అంటూ మాట ఇచ్చారు.

Also Read:Revanth:భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ

- Advertisement -