Bigg Boss 7 Telugu:అమర్‌దీప్ అరాచకం

44
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 6వ వారం పూర్తి చేసుకోవడానికి వస్తోంది. ఇక ఈ వారం ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లు అంటూ ఇచ్చిన టాస్క్‌లో పోటుగాళ్లు సత్తాచాటారు. ఇక తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఇచ్చిన టాస్క్‌లో అమర్ దీప్ ప్రవర్తించిన తీరు దారుణం. అమ్మాయి అని చూడకుండా పిచ్చిపట్టిన వాడిలా ప్రవర్తించాడు అమర్.

‘ఎవరు ఫాస్టెస్ట్’ అంటూ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆటగాళ్లు- పోటుగాళ్లు రెండు జట్ల నుంచి ఒక్కో కంటెస్టెంట్ ముందుకు వస్తారు. వారికి బిగ్‌బాస్ ఓ కలర్ చెప్పగానే ఆ కలర్ వస్తువును ఇంట్లో ఎక్కడుందో వెతికి ముందుగా ఎవరు తీసుకువస్తారో వాళ్లు విన్నర్. ఇలా మొత్తం 8 రౌండ్లు జరుగుతాయి. ప్రతి రౌండ్‌లోనూ కొత్త ఆటగాడు గేమ్‌లో పార్టిసిపేట్ చేయాలని తెలిపారు బిగ్ బాస్.

ఇక ఒక రౌండ్‌లో ఆటగాళ్ల టీమ్ నుంచి అమర్.. పోటుగాళ్ల జట్టు నుంచి అశ్విని శ్రీ బరిలోకి దిగారు. బిగ్‌బాస్ మెరూన్ కలర్ అని చెప్పగానే ఇద్దరూ లోపలికి ఉరికారు. అయితే అమరం మెరూన్ కలర్ ఏదైనా వస్తువును తాను వెతికి గుర్తించి తీసుకురావడం మానేసి అశ్విని ఏం పట్టుకుంటుందా అని గమనించి…ఆ అమ్మాయి ఏదో డోర్ మేట్ తీస్తుంటే వెళ్లి మీద పడిపోయి దాన్ని లాక్కొచ్చి పెట్టేశాడు. తీరా అది మెరూన్ కలర్ కాదనేసరికి మళ్లీ పరిగెత్తి అశ్విని గదిలో ఏదో వస్తువు తీసుకుంటే ఆ అమ్మాయి చేతిలో నుంచి దాన్ని లాక్కోబోయాడు. ఈ క్రమంలో బెడ్ మీద నుంచి అశ్విని కిందపడిపోతుంటే దాన్ని లాక్కొని వచ్చేశాడు.
అది కూడా మెరూన్ కాదని హౌస్ మెట్స్ అరవడంతో మళ్లీ లోపలికి పరిగెత్తాడు. అయితే అమర్ చేస్తున్న దారుణాన్ని పోటుగాళ్లు టీమ్ నుంచి గౌతమ్ వ్యతిరేకిస్తూ గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. కానీ అమర్ మాత్రం దారుణంగా ప్రవర్తించాడు. గందరగోళం నెలకొనడంతో ఈ రౌండ్‌ని బిగ్ బాస్ క్యాన్సిల్ చేసేశాడు. ఇక ఇవాళ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ అమర్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు.

Also Read:చంద్రబాబు కు బెయిల్.. రెడీ?

- Advertisement -