బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుంది. 26వ ఎపిసోడ్‌లో భాగంగా సింగర్ రేవంత్ కెరీర్‌లో అదదిరిపోయే జ్ఞాపకాన్ని అందించారు బిగ్ బాస్. రేవంత్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టేటప్పటికి అతని భార్య అన్విత నిండు గర్భిణి. లాంచింగ్ అప్పుడు ఆమె కూడా స్టేజ్ మీదికి వచ్చింది. అయితే తన భార్యకి తోడుగా ఉండాల్సిన టైంలో బిగ్ బాస్ హౌస్‌లో ఉండటం పట్ల అనేకసార్లు ఎమోషనల్ అయ్యాడు రేవంత్.
గత వారంలో రేవంత్ భార్య అన్విత సీమంతం జరిగింది. ఈ నేపథ్యంలో రేవంత్‌కి సర్ ప్రైజ్ ఇచ్చాడు. రేవంత్ ఒక్కడ్నే గార్డెన్ ఏరియాలోకి పిలిచిన బిగ్ బాస్.. మునుపటి వారం మీ భార్య సీమంతం జరిగింది.. ఆ వేడుకలో మీరు స్వయంగా పాలుపంచుకోలేకపోయిన కారణంగా ఆ మధుర క్షణాలను మీకు చూపించాలని అనుకుంటున్నారు అని వీడియో చూపించారు.
ఈ వీడియో చూస్తున్నంత సేపు రేవంత్ కళ్లు చెమర్చాయి. తన భార్యని చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు రేవంత్. ఇది చాలు బిగ్ బాస్.. ఇక్కడకొచ్చి గెలిచినంత ఆనందంగా ఉంది. పక్కనుంటే బాగుండేది.. నా భార్యకి ఫ్రీ డెలివరీ అవ్వాలి.. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండాలి.. కష్టపడి ఆడి గెలిచి.. ఆ కప్పు తీసుకుని వెళ్లి నా బేబీకి ఇవ్వాలి అని భావోద్వేగానికి లోనయ్యారు రేవంత్.
రేవంత్ భార్యకి తన ఆశీస్సులు బిగ్ బాస్ హౌస్ నుంచి అందించే అవకాశం కల్పిస్తూ.. స్వీట్స్, పళ్లు, ఇతర వస్తువుల్ని మీ భార్యకి చేరవేస్తాం అని అన్నారు బిగ్ బాస్. దీంతో రేవంత్ వెక్కి వెక్కి ఏడ్చాడు.