గర్బసంచి తీసేశారు..కీర్తి ఎమోషనల్

274
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఈ ఆదివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ జర్నీని చూపించి ఎమోషనల్‌కు గురిచేస్తున్న బిగ్ బాస్..తాజాగా కీర్తి జర్నీని చూపించి అందరిచేత కంటతడి పెట్టించారు. యాక్సిడెంట్‌లో తల్లిదండ్రులతో పాటు వదిన అన్న వాళ్ల పిల్లలు ఇలా ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకుని అనాధగా మిగిలింది కీర్తి. కోమాలో కొనఊపిరితో ప్రాణాలతో పోరాడి.. చివరికి బతికి వచ్చింది.

ఈ నేపథ్యంలో కీర్తి 14 వారాల జర్నీని చూపించారు బిగ్ బాస్. ఒకవైపు బరువైన గతం లోలోపల దాడి చేస్తుంటే.. మొండి ధైర్యంతో పోరాడారు. మీకంటూ కుటుంబం లేదని బాధపడినా.. సింపథీ కోసం ఆట ఆడుతుందని నిందించినా.. మీ ఆట ఆగలేదు. గాయాలు మిమ్మల్ని ఆపలేకపోయాయి.. గ్రాండ్ ఫినాలేకి చేరాలనే కోరిక మీ ఒక్కరిదే కాదు.. మీ కుటుంబానిది కూడా. కుటుంబం అంటే ఒక్కరు కాదు.. మీ కుటుంబ సభ్యుల సంఖ్య కొన్ని లక్షలు అంటూ ఆమెలో స్పూర్తిని నింపారు.

తర్వాత మాట్లాడిన కీర్తి…నా లాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.. యాక్సిడెంట్‌లో నా ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. నేను కోమాలోకి వెళ్లిపోయాను. కొన్నాళ్ల తరువాత కళ్లు తెరిచి చూసి.. నా వాళ్ల కోసం నేను వెతుక్కుంటున్నా.. కానీ నేను తప్ప ఎవరూ బతకలేదని తెలిసి.. తట్టుకోలేకపోయాను అని తెలిపింది. యాక్సిడెంట్‌లో నా కడుపుకి గాయం కావడం వల్ల నా గర్భసంచి తీసేశారు.. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని తెలిపింది. ఎవరు నన్ను ఛీ తూ అన్నారో.. నువ్వు అందం లేవు.. చూడ్డానికి బాలేదు అని బయటకు గెంటేశారో.. ఎవరైతే నువ్వు వద్దు అని నన్ను దూరం పెట్టారో వాళ్లకి నేను చెప్తున్నా.. ఇది కీర్తి అంటే.. ఇదే కీర్తి. అంటూ ఎమోషనల్ అయ్యింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -