కప్‌ గెలవడానికే వచ్చాం!

119
- Advertisement -
బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో భాగంగా ఒకరిని ఫైనల్‌కి పంపుతామని బిగ్ బాస్ చెప్పగా ఇందుకోసం కంటెస్టెంట్స్ తెగ పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు బిగ్ బాస్‌కి ఎందుకొచ్చారో చెప్పమని ఇంటి సభ్యులను కోరారు.
తొలుత  శ్రీహాన్.. మా అమ్మకి ఇచ్చిన మాట కోసం ట్రోఫీ గెలవాలి, మా అమ్మ నన్ను అడిగిన మొదటి కోరిక అది అని చెప్పారు. తర్వాత రోహిత్.. మా నాన్న పేరు నిలబెట్టేందుకు కప్పు గెలవాలి అని చెప్పగా నువ్వు అమ్మాయివి, ఏం చేయలేవు, చదువుకోలేదు.. ఇలా చాలా మంది చాలా అన్నారు. వాళ్లందరికీ సమాధానం చెప్పడానికి అయినా కప్పు గెలవాలి, కప్పు గెలిచి మా నాన్నకి అంకితమివ్వాలి అని చెప్పింది ఇనయా.
ఇక రేవంత్.. బిగ్‌బాస్ షోలో మొదటి నుంచి ప్రతి టాస్క్ లో బాగా ఆడుతున్నా. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకి వెళ్తున్నా. అందుకే ట్రోఫీ నాకు చాలా ముఖ్యం అని చెప్పగా  శ్రీసత్య.. నా లైఫ్ లో ఏది అంత ఈజీగా దొరకలేదు. పోరాడి సాధించుకున్నా. అలాంటిది బిగ్‌బాస్ కప్పు గెలిస్తే ఆ కిక్కే వేరు అని చెప్పుకొచ్చింది.  నా లాంటి ఒంటరి అమ్మాయిలకి ఆదర్శంగా నిలవడానికి కప్పు కొట్టాలి అని చెప్పింది కీర్తి.  మా కుటుంబం కోసం, అమ్మాయిలకి ఆదర్శంగా నిలబడేందుకు ట్రోఫీ గెలవాలని ఉంది అని తెలిపింది ఫైమా. మొదటిసారి ఓ కామన్ మ్యాన్ ఇన్ని రోజులు హౌజ్ లో ఉన్నాడు. అడ్డదారులు తొక్కకుండా జెన్యూన్ గా ఆడి కప్పు కొడితే అదే హ్యాపీ అని తెలిపారు ఆదిరెడ్డి.
ఇవి కూడా చదవండి..
- Advertisement -