బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 88 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్ టికెట్ టూ ఫినాలే టాస్క్‌లో భాగంగా రోహిత్ గోల్డెన్ హార్ట్‌తో ఆకట్టుకోగా ఓటమి తట్టుకోలేక రేవంత్ తేలిపోయాడు.
టికెట్ టు ఫినాలే రేస్‌లో నుంచి తప్పుకున్న ఇనయ, శ్రీసత్య, కీర్తి ఈ ముగ్గురూ మళ్లీ తిరిగి ఈ రేస్‌లో పాల్గొనే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. ఈ ముగ్గురికి రంగులుపూసుకునే టాస్క్ ఇచ్చి ఎవరి వీపుపై ఎక్కువ రంగు పడితే వాళ్లు టాస్క్ నుంచి తొలగిపోతారని చెప్పడంతో.. ఇనయ, కీర్తిలు శ్రీసత్యపై ఎటాక్ చేశారు. దీంతో ఈ టాస్క్ నుంచి శ్రీసత్య తప్పుకోవాల్సి వచ్చింది.
ఇక రెండో రౌండ్‌లో కలిసి ఆడిన ఇనయ, కీర్తిలకు ఫైట్ పడింది. వీళ్లిద్దరూ కింద మీద పడుతూ రంగుపూసుకున్నారు. ఇనయ లాగిపడేస్తున్నా కీర్తి టఫ్ ఫైట్ ఇచ్చి గెలిచింది. దీంతో సంచాలక్‌గా ఉన్న రేవంత్‌కి ఎవరు గెలిచారో చెప్పడం కష్టమైంది. దాదాపు ఇద్దరి టీషర్ట్‌లకు ఒకేలా రంగు పూసుకోవడంతో.. స్వల్ప తేడాతో కీర్తిని విన్నర్‌గా ప్రకటిస్తూ. ఇనయని టాస్క్ నుంచి తప్పించాడు.
తర్వాత టాస్క్‌లో మొదటి స్థానంలో రేవంత్, రెండో స్థానంలో ఆదిరెడ్డి మూడో స్థానంలో శ్రీహాన్, నాలుగో స్థానంలో ఫైమా, ఐదో స్థానంలో కీర్తి, ఆరో స్థానంలో కీర్తిలు నిలిచారు. ఈ ఆరుగురిలో నలుగురు మాత్రమే నెక్స్ట్ లెవల్‌కి వెళ్తారని.. ఆ నలుగురు ఎవరో ఏకాభిప్రాయంతో మీరే తేల్చుకోవాలని చెప్పారు బిగ్ బాస్. ఇది ఎంతకి తేలకపోవడంతో సంచాలకులుగా ఉన్న శ్రీసత్య, ఇనయలు నిర్ణయం తీసుకోవాలని బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో వాళ్లిద్దరూ టాస్క్‌లో లీస్ట్ పాయింట్లు ఉన్న.. రోహిత్, కీర్తిలను తప్పించారు.
దీంతో కీర్తి ఆగ్రహం వ్యక్తం చేయగా రోహిత్ మాత్రం కూల్ గా ఆలోచించి అందరి హృదయాలను గెలుచుకున్నారు. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో చివరికి.. ఫైమా, శ్రీహాన్, ఆదిరెడ్డి, రేవంత్‌లు కప్పుల్ని బ్యాలెన్స్ చేసే గేమ్ ఆడారు. ఇందులో రేవంత్ ఓడిపోయేసరికి.. ఇతనికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. అసలు ఓటమిని తట్టుకోలేకపోయాడు. ఆడలేక మద్దెల దరువు అన్నట్టుగా.. అతను చేయి బ్యాలెన్స్ చేయలేక కప్పుల్ని పడేసుకుని.. శాడిష్టు అని నోరు జారాడు రేవంత్. మొత్తంగా టాస్క్ కంప్లీట్ అయ్యేసరికి.. ఆదిరెడ్డి 9 పాయింట్లతో ,రేవంత్ 8 పాయింట్లతో , 6 పాయింట్లతో శ్రీహాన్,5 పాయింట్లతో ఫైమా నాలుగో స్థానంలో నిలిచారు.
ఇవి కూడా చదవండి..