బిగ్ బాస్ 6..డైరెక్ట్ నామినేషన్

111
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 20 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక వీకెండ్‌లో భాగంగా ఎంట్రీ ఇచ్చిన నాగ్‌..కంటెస్టెంట్స్‌ని పొగుడుతూనే తనదైన శైలీలో పంచ్‌లు ఇచ్చారు.

తొలుత నామినేషన్‌లో ఉన్న ఏడుగురిని సోఫా వెనుఏక నిలబెట్టారు నాగ్‌. వారిలో శ్రీహన్, శ్రీసత్య లను సేవ్ చేశారు. తర్వాత 7 బాలాజీ ఆట తీరు బాగోలేదంటూ, వీడియోలు వేసి మరి చూపించి వార్నింగ్ ఇచ్చారు. గీతూ, ఆదిరెడ్డి,శ్రీ సత్యలు 10 మార్కులు తెచ్చుకుని టాప్ లో నిలవగా, వాసంతి, కీర్తి లు తక్కువ మార్కులు తెచ్చుకున్నారు. శ్రీహన్, శ్రీసత్య ల ఆట తీరు మెరుగు పడిందని మెచ్చుకున్నా నాగ్.. శ్రీరాజ్, చంటీ, అర్జున్ కల్యాణ్ ల ఆట తీరుపై చివాట్లు పెట్టాడు.

అర్జున్ కల్యాణ్ శ్రీసత్య కోసం బాగా ట్రై చేస్తున్నాడంటూ ఆడియన్స్ చెప్పగా.. సూర్య-ఆరోహీ రిలేషన్ గురించే నాగ్ బయటపెట్టారు. ఇక చివరలో ట్విస్ట్ ఇస్తూ బిగ్‌బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఎలిమినేషన్ కోసం హోస్ట్ డైరెక్ట్ నామినేట్ చేసే హక్కు బిగ్‌బాస్ నాగ్ కి ఇచ్చాడంటూ బాంబు పేల్చారు. అయితే నాగార్జున ఆ హక్కుని హౌస్ మేట్స్ కి ఇచ్చి వెనుక ఉన్నవారిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తారంటూ అడగగా.. కీర్తీ, అర్జున్ కల్యాణ్ కు ఎక్కువ వేసి డైరెక్ట్ నామినేట్ చేశారు హౌస్ మేట్స్.

- Advertisement -