బిగ్ బాస్ 6..ఈ వారం డబుల్ ఎలిమినేషన్

46
bb6
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా సాగుతోంది. 13వ రోజు వీకెండ్ ఎంట్రీ ఇచ్చారు కింగ్ నాగ్. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి అందరికి షాక్ ఇచ్చారు.

బాలాదిత్య, షాని, సుదీప, వాసంతి, శ్రీసత్య, మెరీనా -రోహిత్, అభినయశ్రీ, కీర్తి, శ్రీహన్.. వీరందరిని వెనకాల నించోమని సీరియస్ గా చెప్పారు. ఈవారం ఆట ఏమాత్రం బాలేదని…మిగిలిన వాళ్లలో ఫైమా తను ఓడినా, పక్కనివాళ్ళు గెలవకూడదు అని ఆడుతుంది అది తప్పు అని సీరియస్ అయ్యారు. చంటి సరిగా ఆడటం లేదని, సూర్య హౌస్ కి గేమ్ ఆడటానికి వచ్చినట్లు లేదు, చిల్ అవ్వడానికి వచ్చినట్లు ఉందని క్లాస్ ఇచ్చారు. ఇక రేవంత్ జడ్జిమెంట్ చేస్తున్నట్లు కాకుండా తన ఆటపై ఫోకస్ చేయాలని ఫైర్ అయ్యారు.

ఇక శనివారం ఇంటినుండి షాని ఎలిమినేట్ కాగా వేదిక మీదకి వచ్చి బిగ్‌బాస్ లో అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్ చెప్పారు. ఇక చివరగా ఒకేఒక జీవితం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమల, హీరో శర్వానంద్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. కాసేపు ఇద్దరూ సరదాగా మాట్లాడారు.

- Advertisement -