టాప్ గేర్…ఫస్ట్ లుక్

71
Top Gear First Look Motion Poster
- Advertisement -

ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు పరిచయమైన సాయి కుమార్ కుమారుడు ఆది సాయి కుమార్ తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా టాప్‌గేర్ అంటూ ప్రేక్షకుల ముందుకురానున్నారు.

తాజాగా చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఆది సాయి కుమార్ లుక్ చూస్తుంటే సినిమాలో ఏదో తెలియని పాయింట్ టచ్ చేశారని తెలుస్తోంది. ఇకపోతే కాస్త వినూత్నంగా ఆలోచించి తొలిసారి 3D మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సినిమా తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకం కానుందని హీరో ఆది సాయి కుమార్ చెప్పడం సినిమాపై అంచనాలు పెంచేసింది. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ టాప్ గేర్ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొని ఓ వైవిద్యభరితమైన కథతో రూపొందించనున్నారు. ఈ చిత్రానికి K.V. శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -