ట్రాన్స్ జెండర్ ప్రియ..ఎమోషన్!

174
bb5
- Advertisement -

బిగ్ బాస్‌ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 19వ ఎపిసోడ్ పూర్తిచేసుకోగా మూడోవారం ఎలిమినేషన్‌కు కూడా రంగం సిద్ధమైంది. ఇక మూడోవారం ఇంటి కెప్టెన్‌గా జస్వంత్‌ ఎంపిక కాగా ఇంటి సభ్యులైన సిరి, ప్రియాంక తమ తొలి ప్రేమను చెబుతూ నా ఆటోగ్రాఫ్‌ సినిమాను గుర్తుచేశారు. గురువారం ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యులు వారి వారి తొలి ప్రేమల్ని గుర్తు చేసుకున్నారు. ట్రాన్స్ జెండర్ ప్రియాంక (ప్రియ) తన లవ్ స్టోరీని చెప్పుకుని ఎమోషనల్ అయ్యింది.

అతని పేరు రవి.. అలా పిలవడం నాకు ఇష్టం లేక నేను ముద్దుగా అబ్బాయి అంటూ ఉంటా.. ఓ ఫంక్షన్‌లో అతన్ని చూశా.. చూడ్డానికి చాలా బాగుంటాడు.. అతన్ని చూడగానే నచ్చేశాడు.. పరిచయం అయిన తరువాత ఒకర్నొకరు అర్థం చేసుకున్నాం..ఎక్కడికి వెళ్లినా ఇద్దరం కలిసే వెళ్లాం అన్నారు.

తనంటే నాకు చాలా ఇష్టం కానీ.. ఆ మాట తనకి నేను ఎప్పుడూ చెప్పలేదు.. ధైర్యం సరిపోలేదు. మా సిస్టర్‌కి పెళ్లి అయ్యింది.. నా ఇబ్బందులు కూడా క్లియర్ అయ్యాయి.. అమ్మనాన్నల్ని నేను చూసుకోగలననే నమ్మకంతో నేను నా జెండర్‌ని ఛేంజ్ చేసుకున్నా.. అమ్మాయిగా మారిన తరువాత కొన్నాళ్ల పాటు అతనికి కనిపించలేదని తెలిపింది. అయితే తర్వాత అతన్ని కలిసి నా మనసులోని మాటను చెప్పి రిలేషన్ షిప్‌లో ఉన్నాం. కొద్దిరోజుల తర్వాత తన ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పి వెళ్లిపోయాడు.

నన్ను కూడా పెళ్లి చేసుకుంటా అన్నావ్ కదా అని అడిగితే…నువ్ ఏమైనా అమ్మాయివా?? నీకు పిల్లలు పుడతారా? ఏం మాట్లాడుతున్నావ్ అని వెళ్లిపోయాడు. చాలా హాస్పటల్స్ తిరిగాను.. తల్లిని కావడం కోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టా ఇదే విషయాన్ని అతడితో చెప్పిన పట్టించుకోలేదు. అయితే ఓ రోజు అతనికి మెసేజ్ పెట్టా.. ఒకరోజు ఇంటిరా అని.. తను వచ్చాడు. అనుక్షణం నువ్వే గుర్తొస్తున్నావ్ అని చెప్పాను. అప్పుడు తను.. నీకు చెప్పాను కదా.. నాకు పెళ్లి అని మళ్లీ నువ్ ఇలా మాట్లాడుతున్నావ్ ..?అంటూ అతడు ఆక్షణం మాట్లాడిన మాటలు ఇప్పటకి సూదుల్లా గుచ్చుతూనే ఉన్నాయి. ఐ లవ్యూ.. ఐ మిస్ యూ. నీకు నా తరపున రిక్వెస్ట్ ఏంటంటే.. నువ్ మళ్లీ నా లైఫ్‌లోకి రావద్దు.. ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు అని కన్నీళ్లుపెట్టుకుంది.

- Advertisement -