బిగ్ బాస్ 5: మొదటి వారం ఎలిమినేషన్‌లో ఉన్నది వీరే..

107
- Advertisement -

అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్‌ బాస్‌’ రియాలిటీ షో ఐదో సీజన్‌ ఆదివారం అట్టహాసంగా ఆరంభమైంది. 19 మంది కంటెస్టెంట్ల ఇళ్లంతా గందరగోళంగా మారింది. ఇక ఇందులో తెలియన మొహాలు కూడా చాలానే ఉన్నాయి. మొత్తంగా పది మంది ఆడవాళ్లుంటే.. తొమ్మిది మంది మగవాళ్లున్నారు. ఇందులో అన్ని రంగాల నుంచి వచ్చిన వారున్నారు. యాంకర్లు, డ్యాన్సర్లు, సింగర్, యాక్టర్లు, సోషల్ మీడియా సెలెబ్రిటీలు ఇలా అందరూ ఉన్నారు. మొత్తానికి బిగ్ బాస్ ఇంట్లోకి అయితే అందరూ వెళ్లిపోయారు. నిన్న అయితే ఎలాంటి గొడవలు, వాగ్వాదాలు జరగలేదు.

బిగ్ బాస్ షో అంటేనే అంతా లీకుల మయం. ఈ సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మొదటి వారం నామినేషన్ లిస్ట్ కూడా వచ్చేసింది. నామినేషన్ ప్రాసెస్ ఏంటి? ఎలా జరిగింది అనే విషయాలు మాత్రం తెలియడం లేదు. కానీ మొదటి వారం ఇంటి నుంచి బయటకువెళ్లేందుకు మంచి సభ్యులే లిస్ట్‌లోకి వచ్చారని తెలుస్తోంది.

మొత్తంగా ఆరు మంది నామినేషన్‌లోకి వచ్చారు. ఇందులో యాంకర్ రవి, మానస్, హమీద, సరయు, కాజల్, జెస్సీ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరందరూ నామినేషన్‌లోకి వచ్చారంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. ఇక ఇదే నిజమైతే.. బోల్డ్ బ్యూటీకి, మోడల్‌కు, హమీదకు మూడినట్టు కనిపిస్తుంది. ఈ ముగ్గురిలోనే ఎలిమినేషన్‌కు ఎక్కువ చాన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే ఇది బిగ్ బాస్ షో అన్నది గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఏం జరుగుతుంది.. ఎలా జరుగుతుంది.. అనేది ఊహించలేం. సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 10 గంటలకు, శని – ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు షో ప్రసారం కానుంది. ‘ఇక్కడ కిక్‌ టన్నుల కొద్దీ ఉంటుంది’ అని షోపై నాగార్జున అంచనాలు పెంచారు.

- Advertisement -